Telangana: సాయిచంద్ కుటుంబానికి ప్రభుత్వ బాసట.. ఫోక్ సింగర్ భార్యకే ఆ పదవి బాధ్యతలు.. వివరాలివే..

Telangana: ఫోక్ సింగర్ సాయిచంద్ గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. తన పాటతో తెలంగాణ ప్రజలను ఓ ఊపు ఊపిన సాయిచంద్ తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ కూడా . తెలంగాణ ఉద్యమం సాకారం కావడంలో ఈయన ఎంతో సహాయకారిగా..

Telangana: సాయిచంద్ కుటుంబానికి ప్రభుత్వ బాసట.. ఫోక్ సింగర్ భార్యకే ఆ పదవి బాధ్యతలు.. వివరాలివే..
Sai Chand's Wife Rajni and Minister Talasani

Edited By: శివలీల గోపి తుల్వా

Updated on: Jul 21, 2023 | 7:41 AM

Telangana: ఫోక్ సింగర్ సాయిచంద్ గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. తన పాటతో తెలంగాణ ప్రజలను ఓ ఊపు ఊపిన సాయిచంద్ తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ కూడా . తెలంగాణ ఉద్యమం సాకారం కావడంలో ఈయన ఎంతో సహాయకారిగా పని చేశారు. సాయి చంద్‌కు ఇద్దరు పిల్లలు. నాలుగో తరగతి చదువుతున్న కొడుకు, ఐదు సంవత్సరాల కూతురు, తన భార్య రజిని. పాయిచంద్ అకాల మరణంతో కష్టాలపాలైన ఈ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటానని హామీ ఇచ్చిన విధంగానే ఆదుకుంది.

సింగర్ సాయి చంద్ భార్యకు తెలంగాణ రాష్ట్ర వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్‌గా ఉత్తర్వులు జారీ చేసింది. నాంపల్లిలోని రాష్ట్ర వేర్ హౌసింగ్ కార్పొరేషన్ కార్యాలయంలో చైర్మన్‌గా బుధవారం రజిని బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా రజినీకి బొకే అందజేసి, శుభాకాంక్షలు తెలియజేశారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. తమ కుటుంబానికి ఎప్పుడు అండగా ఉంటామని రాష్ట్ర ప్రభుత్వం తరఫున హామీ ఇచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి