Telangana: రైతులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. ఈనెల 28 నుంచి రైతుబంధు సాయం
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. రైతుబంధు సాయం ఈనెల 28 నుంచి రైతులకు అందనుంది. సంక్రాంతి లోపు రైతుల ఖాతాల్లో నగదు జమ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు.

నూతన సంవత్సరం సమీపిస్తున్న సమయంలో రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ సర్కార్. ఈ నెల 28 నుంచి యాసంగి రైతుబంధు సాయం అందించబోతున్నట్లు ప్రకటించింది. పంట పెట్టుబడికి రైతుబంధు నిధులు విడుదల చేయనుంది ప్రభుత్వం. ఈ మేరకు ఆర్థిక మంత్రి హరీశ్‌రావుకు ఆదేశాలు జారీ చేశారు సీఎం కేసీఆర్. సంక్రాంతి కల్లా రైతులందరి ఖాతాల్లో రైతుబంధు నిధులు జమ అవ్వనున్నాయి. ఆరోహణ క్రమంలో.. ఒక ఎకరం నుంచి ప్రారంభమై ఎక్కువ భూమి ఉన్న వారి వరకు రైతుబంధు నిధులు జమ ఉంటుంది. రూ.7600 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికే అధికారులు ఆయా జిల్లాల డేటాను ప్రభుత్వానికి అందజేసినట్లు సమాచారం.
ప్రభుత్వం అందిస్తున్న రైతుబంధు ఆర్థికసాయం రాష్ట్రంలో వ్యవసాయ అభివృద్ధికి ఎంతగానో దోహద పడుతుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. దళారీ వ్యవస్థ లేకుండా డైరెక్ట్‌గా రైతుల ఖాతాల్లోనే నగదు జమ అవుతుందని పేర్కొన్నారు. రైతులు అప్పులు చేయకుండా.. సకాలంలో ఎరువులు, ఇతర ఖర్చుల కోసం ఈ డబ్బు సాయపడుతుందని.. దీంతో అధిక దిగుబడులు సాధిస్తున్నారని సీఎం చెప్పారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం చూడండి..




