AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T.Congress: టీడీపీ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన 13 మంది రేవంత్‌ వర్గం నేతల రాజీనామా.. ముదిరిన సంక్షోభం..

తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీలో సంక్షోభం మరింత ముదిరింది. రాజీనామా చేసిన 13 మంది రేవంత్‌‌కు చెందిన వర్గం నేతలు. టీడీపీ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన నేతలు తమ పదవులకు రాజీనామా చేశారు. రాజీనామా చేసిన వారిలో వేం నరేందర్ రెడ్డి, సీతక్క, విజయ రమణారావు, చారగొండ వెంకటేష్, ఎర్ర శేఖర్‌తోపాటు పదవులకు నేతల రాజీనామా చేశారు. 

T.Congress: టీడీపీ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన 13 మంది రేవంత్‌ వర్గం నేతల రాజీనామా.. ముదిరిన సంక్షోభం..
Revanth Reddy
Sanjay Kasula
|

Updated on: Dec 18, 2022 | 6:01 PM

Share

రేవంత్ రెడ్డి వర్గం ఎత్తుకు పైఎత్తు వేసిందా..? తిరుగుబాటు చేసిన కాంగ్రెస్ సీనియర్లకు చెక్ పెట్టేందుకే 13మందితో రాజీనామా చేయించిందా..? టీ కాంగ్రెస్‌లో జరుగుతున్న అనూహ్య పరిణామాలు చూస్తుంటే ఇది రేవంత్ వర్గం వ్యూహాత్మక ఎత్తుగడగా పరిశీలకులు భావిస్తున్నారు. టీడీపీ నుంచి ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన 13 మంది రేవంత్ వర్గీయులు ఇటీవల తమకు దక్కిన పదవులకు రాజీనామా చేశారు. ఇది అనూహ్య పరిణామంగా అందరూ భావిస్తున్నప్పటికీ ఇదంతా కాంగ్రెస్ సీనియర్లకు చెక్ పెట్టేందుకే రేవంత్ వర్గం పన్నిన వ్యూహాత్మక ఎత్తుగడగా చెబుతున్నారు. కొత్తగా పార్టీలో చేరిన 50మందికి రేవంత్ పదవులు ఇప్పించుకున్నట్టు కాంగ్రెస్ సీనియర్లు పదేపదే ఎత్తిచూపుతున్న దృష్ట్యా ఆ నెంబర్ సరికాదని, 13 మందికే పదవులు ఇచ్చామని, సీనియర్ల వాదనలో నిజం లేదని చెప్పడమే ఈ రాజీనామాల ఉద్దేశ్యమని అంటున్నారు.

ఇదిలావుంటే.. రేవంత్ శిబిరం వర్సెస్ సీనియర్ల శిబిరంలా తయారై టోటల్‌గా వ్యవహారం రచ్చరంబోలా అవుతోంది. ఇందిరాభవన్‌లో రేవంత్ ఆధ్వర్యంలో ప్రస్తుతం జరుగుతున్న ఎగ్జిక్యూటీవ్ సమావేశానికి నిన్న తిరుగుబాటు చేసిన ఒక్క సీనియర్ కూడా హాజరుకాలేదు.

ఏ ఒక్కరైనా వస్తారనే గంపెడాశతో ఉన్న రేవంత్ వర్గం నాయకులు ఇంకా ఎదురుచూస్తూనే ఉన్నారు. వారిలో ఆశలు సన్నగిల్లిపోతున్నాయి. పైకి మాత్రం ఇంకా సమయం ఉంది.. వస్తారు. వస్తారంటూ రేవంత్ వర్గం నాయకులు మీడియా ముందు మేకపోతు గాంభీర్యం ప్రదర్శించారు. కానీ, మీటింగ్‌కు వచ్చే ప్రశ్నే లేదని సీనియర్లు భీష్మించుకుని కూర్చోవడంతో రేవంత్‌ వర్గం మరో ఎత్తుగడతో ముందుకు వెళ్తున్నారు.

పదవులకు రాజీనామా చేసిన వారు

  • వేం నరేందర్‌రెడ్డి, ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యుడు
  • సీతక్క, ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యురాలు
  • విజయ రమణారావు, టి.పీసీసీ ఉపాధ్యక్షుడు
  • దొమ్మాటి సాంబయ్య, టి.పీసీసీ ఉపాధ్యక్షుడు
  • టి.జంగయ్య యాదవ్‌, టి.పీసీసీ ఉపాధ్యక్షుడు
  • కవ్వంపల్లి సత్యనారాయణ, కరీంనగర్‌ డీసీసీ అధ్యక్షులు
  • సుభాష్‌రెడ్డి, పీసీసీ జనరల్‌ సెక్రటరీ
  • చారగొండ వెంకటేష్‌, పీసీసీ జనరల్‌ సెక్రటరీ
  • పటేల్‌ రమేష్‌రెడ్డి, పీసీసీ జనరల్‌ సెక్రటరీ
  • సత్తు మల్లేష్‌, పీసీసీ జనరల్‌ సెక్రటరీ
  • చిలుక మధుసూదన్‌రెడ్డి, పీసీసీ జనరల్‌ సెక్రటరీ
  • శశికళ యాదవరెడ్డి, పీసీసీ జనరల్‌ సెక్రటరీ

మరిన్ని తెలంగాణ వార్తల కోసం