జనగామ జిల్లాలో సైబర్ మోసం.. 11 లక్షలు పోగొట్టుకున్న RTC డ్రైవర్..ఏం జరిగిందంటే..

| Edited By: Jyothi Gadda

Aug 10, 2024 | 6:21 PM

తీరా రామేశ్వర్ అకౌంట్ లో కేవలం 149 రూపాయలు మాత్రమే మిగిలి ఉన్నాయి... అది గమనించిన కండక్టర్ లబోదిబోమంటూ వెంటనే బ్యాంకుకు వెళ్లి పరిశీలించాడు.. అప్పటికే అకౌంట్లోను డబ్బంతా సైబర్ మోసగాళ్లు కాజేసినట్టు తెలుసుకొని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కానీ ఫలితం లేదు..

జనగామ జిల్లాలో సైబర్ మోసం.. 11 లక్షలు పోగొట్టుకున్న RTC డ్రైవర్..ఏం జరిగిందంటే..
Cyber Fraudsters
Follow us on

ఇంటికంటే బ్యాంకు పదిలం అనే భావనతో బ్యాంకులలో పైసా పైసా కూడా పెట్టుకునే ప్రజలు ఇప్పుడు సైబర్ మోసగాల వలలో చిక్కుకొని విలవిలాడుతున్నారు.. కష్టార్జితమంతా ఆ కేటుగాళ్లు కళ్ళు మూసి తెరిచేలోపే దోచేస్తున్నారు.. తాజాగా జనగామ జిల్లాలో ఓ కండక్టర్ తన జీవితకాలమంతా సంపాదించుకుని పోగు చేసుకున్న సొమ్మంతా ఒక్క నిమిషంలోనే కాజేశారు సైబర్ మోసగాళ్లు.  ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 11 లక్షల రూపాయలు కాజేయడంతో ఆ కండక్టర్ కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే…

రామేశ్వర్ అనేవ్యక్తి జనగామ డిపోలో కండక్టర్ గా పని చేస్తున్నాడు.. తన జీవిత ఆశయం సొంత ఇల్లు కట్టుకోవాలనే లక్ష్యంతో పైసా పైసా పోగు చేసుకుంటున్నాడు. దాదాపు 11 లక్షలకు పైగా బ్యాంకులో జమ చేసుకున్నాడు.. బ్యాంకులో ఉంటే భద్రంగా ఉంటాయని నమ్మకంతో ఎంతో భరోసాతో ఉన్నాడు.. కానీ సైబర్ మోసగాళ్లు నిండా ముంచేశారు.

బ్యాంకు నుండి మాట్లాడుతున్నామని ఏపీకే అప్డేట్ చేస్తున్నామని నమ్మించారు. ఒక లింక్ పంపించి అందులో ఇతకి వివరాలు అప్డేట్ చేయాలని సూచించారు.. పూర్తి ఆధారాలు ఇచ్చిన కొద్ది నిమిషాల్లోనే అకౌంట్లో ఉన్న అమౌంట్ అంతా ఊడ్చేశారు..

ఇవి కూడా చదవండి

తీరా రామేశ్వర్ అకౌంట్ లో కేవలం 149 రూపాయలు మాత్రమే మిగిలి ఉన్నాయి… అది గమనించిన కండక్టర్ లబోదిబోమంటూ వెంటనే బ్యాంకుకు వెళ్లి పరిశీలించాడు.. అప్పటికే అకౌంట్లోను డబ్బంతా సైబర్ మోసగాళ్లు కాజేసినట్టు తెలుసుకొని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కానీ ఫలితం లేదు..

జీవితకాలమంతా కష్టపడి కూడబెట్టుకున్న సొమ్మంతా సైబర్ మోసగాళ్లు కాజేయడంతో తల్లడిల్లి పోతున్నారు.. తనలాంటి మోసం ఎవరికి జరగవద్దని, ఇలాంటి సైబర్ మోసగాలను పట్టుకొని కఠినంగా శిక్షించాలని కోరుతున్నాడు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..