RS Praveen Kumar: ఇక ప్రజాసేవలో.. రాజీనామాపై క్లారిటీ ఇచ్చిన ఆర్ఎస్ ప్రవీణ్‌ కుమార్..

|

Jul 19, 2021 | 9:00 PM

ఐపీఎస్ అధికారి, తెలంగాణ గురుకుల పాఠశాలల డైరెక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వాలంటరీ రిటైర్మెంట్ కోరుతూ.. రాజీనామా లేఖ రాశారు. RS ప్రవీణ్‌ కుమార్ ఎందుకిలాంటి సడెన్ డెసిషన్...

RS Praveen Kumar: ఇక ప్రజాసేవలో.. రాజీనామాపై క్లారిటీ ఇచ్చిన ఆర్ఎస్ ప్రవీణ్‌ కుమార్..
Rs Praveen Kumar
Follow us on

ఐపీఎస్ అధికారి, తెలంగాణ గురుకుల పాఠశాలల డైరెక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వాలంటరీ రిటైర్మెంట్ కోరుతూ.. రాజీనామా లేఖ రాశారు. RS ప్రవీణ్‌ కుమార్ ఎందుకిలాంటి సడెన్ డెసిషన్ తీసుకున్నారని సర్వత్రా చర్చ నడుస్తోంది. తన స్వచ్ఛంద పదవీ విరమణ నిర్ణయంపై స్పందించారు ప్రవీణ్‌కుమార్‌. రాజకీయ ప్రవేశంపై ఇప్పుడే ఏం చెప్పలేనని టీవీ9తో ప్రత్యేకంగా చెప్పారు. నూటికి నూరు శాతం పేదల పక్షాన ఉంటానని స్పష్టంచేశారు ప్రవీణ్‌ కుమార్.

రాజకీయ, ప్రభుత్వ పదవుల్లో సమ న్యాయం జరగట్లేదని ప్రవీణ్ కుమార్ అభిప్రాయం. ఓబీసీ- ఎస్సీ- ఎస్టీల్లో చీఫ్‌ సెక్రటరీ వంటి ఉన్నత పదవుల్లో ప్రాతినిథ్యం తక్కువగా ఉందని గణాంకాలతో సహా వివరిస్తున్నారు. ప్రజాసేవలో మరింతగా నిమగ్నం కావాలని కోరుకుంటున్నట్టు ప్రకటించారు ప్రవీణ్ కుమార్.

2013 లో గురుకులాల సెక్రటరీగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆయన ఎన్ కౌంటర్లకు స్వస్తి చెప్పి.. గురుకుల విద్యపై తన దృష్టి సారించారు. పదునైన విద్యార్ధులను తయారు చేస్తే.. ఇతర సామాజిక సమస్యలు వాటంతటవే సర్దుకుంటాయన్నది ఆయన భావన. అంతకన్నా ముందు నుంచే ప్రవీణ్‌ కుమార్ కు ఇలాంటి ఆలోచన ఉండేది. భావిభారతాన్ని తీర్చిదిద్దడం అన్నిటికన్నా ముఖ్యమైనదని ఆయన నమ్ముతుంటారు. అందుకే 2012లో స్వేరోస్ పేరిట ఒక స్వచ్ఛంద సంస్థ స్థాపించారు. గురుకులాల్లో చదివిన వారందరినీ స్వేరోస్ లో చేర్చారు ప్రవీణ్‌ కుమార్.

ఆర్ఎస్ ప్రవీణ్‌ కుమార్ 1995 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. స్వగ్రామం మహబూబ్ నగర్ జిల్లా ఆలంపూర్. 2002 నుంచి 2004 వరకూ కంరీంనగర్ జిల్లా ఎస్పీగా పని చేశారు. ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకున్న అధికారిగా పేరు. ప్రవీణ్ కుమార్ హయాంలో ఒకే సారి 45 మంది జనశక్తి నర్సల్స్ లొంగిపోయారంటే అర్ధం చేసుకోవచ్చు.. ప్రవీణ్ ఎంతటి పవర్ఫుల్ ఆఫీసర్‌. ఇక సంకల్పం, సంజీవని, కాలేకడుపుకు బుక్కెడు అన్నం, మావోల బాధిత సంఘం, టీచర్లూ మా ఊరికి రండి, మా ఊరి గోసలాంటి కార్యక్రమాలు నిర్వహించారు ఆర్ఎస్ ప్రవీణ్.

RS ప్రవీణ్ కుమార్ అంటే సంచలన ఎన్ కౌంటర్లకు పెట్టింది పేరు. మంథని, మహదేవ్ పూర్, కాటారంలో ఆయన సంచలన ఎన్ కౌంటర్లు చేశారు. జనశక్తి సెక్రటరీ రణధీర్, బక్కన్న ఎన్ కౌంటర్లు చేశారు ప్రవీణ్. తెలంగాణ మావోయిస్టు మహిళా సెక్రటరీ పద్మక్క ఎన్ కౌంటర్ సైతం ప్రవీణ్ ఖాతాలోనిదే. పొలిట్ బ్యూరో మెంబర్ సందె రాజమౌళి ఎన్ కౌంటర్ లోనూ కీలక పాత్ర ప్రవీణ్ కుమార్ ది. గ్రేహౌండ్స్ ఐజీగా మూడేళ్ల పాటు పని చేసిన అనుభవశాలి ఐపీఎస్ ప్రవీణ్‌ కుమార్.

ఇవి కూడా చదవండి: Childhood Love-Murder: ప్రియుడి మోజులో భర్తకు స్పాట్‌.. చిన్ననాటి ప్రేమికుడి కోసం భర్తను ఖతం చేసిన భార్య..

Viral Video: కుక్క నటన… పిల్లి గాండ్రింపు.. ఇది చూసిన నెటిజన్లు నవ్వుకుంటున్నారు..