Fancy Number Auction: హైదరాబాదులో ఫ్యాన్సీ నెంబర్ల జోరు.. 7 నెలల్లోనే రూ.50 కోట్ల లాభం

| Edited By: Srilakshmi C

Dec 19, 2023 | 8:57 AM

నగరంలో ఫ్యాన్సీ నెంబర్ల జోరు విపరీతంగా పెరిగింది. తీసుకున్నటువంటి వాహనానికి ఫ్యాన్సీ నెంబర్ల కోసం వాహనదారులు పోటీపడుతున్నారు కొందరు. ఏదో ఒక ఫ్యాన్సీ నెంబర్ దొరికితే చాలు అని కోరుకుంటున్న వారు సైతం పెరుగుతున్నట్లుగా అధికారులు తెలిపారు. ఏడాదిలో కేవలం మొదటి ఏడూ నెలలోనే 50 కోట్ల రూపాయల వరకు ఫ్యాన్సీ నెంబర్ల ద్వారా నగదు సమకూరిందని, డిసెంబర్ చివరి వారంలో పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఆర్టిఏ అధికారులు తెలిపారు..

Fancy Number Auction: హైదరాబాదులో ఫ్యాన్సీ నెంబర్ల జోరు.. 7 నెలల్లోనే రూ.50 కోట్ల లాభం
Fancy Number Auction
Follow us on

నిజామాబాద్, డిసెంబర్‌ 19: నగరంలో ఫ్యాన్సీ నెంబర్ల జోరు విపరీతంగా పెరిగింది. తీసుకున్నటువంటి వాహనానికి ఫ్యాన్సీ నెంబర్ల కోసం వాహనదారులు పోటీపడుతున్నారు కొందరు. ఏదో ఒక ఫ్యాన్సీ నెంబర్ దొరికితే చాలు అని కోరుకుంటున్న వారు సైతం పెరుగుతున్నట్లుగా అధికారులు తెలిపారు. ఏడాదిలో కేవలం మొదటి ఏడూ నెలలోనే 50 కోట్ల రూపాయల వరకు ఫ్యాన్సీ నెంబర్ల ద్వారా నగదు సమకూరిందని, డిసెంబర్ చివరి వారంలో పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఆర్టిఏ అధికారులు తెలిపారు. మార్కెట్‌లోకి వచ్చిన కొత్త మోడల్ బండి తీయడమే కాదు.. దానికి ఫ్యాన్సీ నంబర్ కూడా ఉంటే.. ఆ కిక్కే వేరన్నది కొందరి వెర్షన్. అందుకే ఫ్యాన్సీ నెంబర్లను దక్కించుకునేందుకు లక్షలు పోస్తున్నారు. కొన్ని సార్లు అయితే బండి ధర కంటే.. ఫ్యాన్సీ నంబర్ కోసం పెట్టిన ఖర్చే అధికంగా ఉంటుంది కూడా. పైగా ఫ్యాన్సీ నంబర్స్‌పై కొందరికి భలే మోజు ఉంటుంది. వాటిని దక్కించుకునేందుకు లక్షలు పెట్టేందుకు కూడా వెనకాడరు. అలాంటి వాళ్ల ఆశే ఇప్పుడు తెలంగాణ ఆర్టీఏకు కాసుల పంట పండిస్తుంది… కోట్లు తెచ్చిపెడుతుంది..

ఫ్యాన్సీ నెంబర్లకు ఉండే డిమాండ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. సెంటిమెంట్‌ అయితేనేమి, ఇష్టమైన నంబ‌ర్‌ అయితేనేమి, జాతక బలం ప్రకారం అయితేనేమి అనుకున్న నంబర్‌ను ద‌క్కించుకునేందుకు వాహ‌నాల య‌జ‌మానులు ఎంతదాకా అయినా ఖర్చు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇందులో సెలబ్రిటీలతో పాటు సంపన్న వర్గాల వారు ఉంటారు. ఫ్యాన్సీ నెంబర్ల వేలంలో.. ఒక్కరోజే ఖైర‌తాబాద్ ఆర్టీఏ ఆఫీసులో కాసుల వర్షం కురిసిన సందర్భలు ఎన్నో ఉన్నాయి. ఫ్యాన్సీ నెంబర్ క్రేజ్‌ కారణంగా.. ఒక్కరోజులో అరకోటి ఆదాయం వచ్చిన రోజులు కూడా ఉన్నాయి.

చాలామందికి ఫ్యాన్సీ నంబర్లపై మోజు ఉంటుంది. కొంతమంది జాతకరీత్యా కావలసిన నెంబర్ కోసం ప్రయత్నిస్తారు. కొంతమందికి నెంబర్ సెంటిమెంట్ ఉంటుంది. ఇలా రకరకాల కారణాలతో కావలసిన నెంబర్ కోసం చాల మంది ప్రయత్నిస్తారు. రవాణా శాఖ ఇటువంటి ఫ్యాన్సీ నెంబర్లను ప్రతి ముడు నెలలకు వేలంపాటలో ఉంచుతుంది. ప్రతి సిరీస్ లోనూ ఇలా ఫ్యాన్సీ నెంబర్లు వేలంలో ఉంచుతారు. దీంతో ఫ్యాన్సీ నెంబర్లకు ఎప్పుడూ క్రేజ్ కొనసాగుతోందని తాజాగా ఖైరతాబాద్‌లోని RTA ఆఫీసులోని వేలం మరోసారి నిరూపించింది. వాహనదారులు అభిరుచిని ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్ క్యాష్ చేసుకుంది. దీంతో తాజాగా ఖైరతాబాద్‌లోని RTA ఆఫీసులో నిర్వహించిన ఫ్యాన్సీ నెంబర్ల వేలం ద్వారా భారీ ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. దాదాపు కార్యాలయంలో కేవలం ఏడు నెలల్లోని 50 కోట్ల రూపాయలు నగదు సమకూరిందంటే ఫ్యాన్సీ నెంబర్ల జోష్ ఏ విధంగా ఉందో ఊహించుకోవచ్చు. ప్రజలకు ఫ్యాన్సి నెంబర్ల మీద ఉన్న మోజు అధికారులు క్యాచ్ చెసుకున్నారు. దీంతో ఫ్యాన్సీ నెంబర్లు వెలం వేసిన ప్రతిసారి ఆర్టీఏకి భారీగా ఆదాయం తోచ్చిపెడుతున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.