Hyderabad: అమ్మ బాబోయ్..! హైదరాబాద్ జిల్లాలో ఒక్కరోజే భారీగా నగదు పట్టివేత

| Edited By: Balaraju Goud

Mar 22, 2024 | 6:52 PM

దేశంలో ఎన్నికల కోడ్ అమలవుతున్న నేపథ్యంలో ఎక్కడికక్కడ అక్రమ నగదు సరఫరాను అధికారులు అడ్డుకుంటున్నారు. ఎక్కడికక్కడ చెక్ పోస్టులు, ఫ్లైయింగ్ స్క్వాడ్‌లతో అధిక మొత్తంలో తరలిస్తున్న డబ్బును, మద్యం, ఇతర విలువైన వస్తువులను పట్టుకుంటున్నారు. సరైన పత్రాలు లేని వాటిని సీజ్ చేస్తున్నారు.

Hyderabad: అమ్మ బాబోయ్..! హైదరాబాద్ జిల్లాలో ఒక్కరోజే భారీగా నగదు పట్టివేత
Vehicle Checking
Follow us on

దేశంలో ఎన్నికల కోడ్ అమలవుతున్న నేపథ్యంలో ఎక్కడికక్కడ అక్రమ నగదు సరఫరాను అధికారులు అడ్డుకుంటున్నారు. ఎక్కడికక్కడ చెక్ పోస్టులు, ఫ్లైయింగ్ స్క్వాడ్‌లతో అధిక మొత్తంలో తరలిస్తున్న డబ్బును, మద్యం, ఇతర విలువైన వస్తువులను పట్టుకుంటున్నారు. సరైన పత్రాలు లేని వాటిని సీజ్ చేస్తున్నారు. హైదరాబాదులో రోజురోజుకు అక్రమ నగదు తరలింపు పెరుగుతుంది. శుక్రవారం ఒక్కరోజే రూ. 38 లక్షలకు పైగా నగదును జిల్లా అధికారులు పట్టుకున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ తెలిపారు.

హైదరాబాద్ జిల్లాలో ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలతో శుక్రవారం ఒక్కరోజే రూ. 38,73,500 నగదు, 43.11 లీటర్ల అక్రమ లిక్కర్‌ను, రూ.1,18,799 విలువ గల ఇతర వస్తువులు సీజ్ చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ తెలిపారు. ఇంతపెద్ద మొత్తంలో ఇటీవల ఎన్నికల కోడ్ వచ్చాక దొరకడం ఇదే మొదటిసారి అని అయన వెల్లడించారు.

హైదరాబాద్‌లో ఇప్పటి వరకు మొత్తం రూ.85,91,800 నగదు, రూ.19,06,089 విలువ గల ఇతర వస్తువులను పట్టుకున్నారు. 220.4 లీటర్ల అక్రమ మద్యాన్ని సీజ్ చేశారు. ఇప్పటివరకు 26 మందిపై ప్రోహిబిషన్ కేసులు నమోదు చేశారు. వివిధ కేసుల కింద 27 మందిని అరెస్టు చేసినట్లు జిల్లా అధికారులు తెలిపారు.

ఏ ఏ అధికారులు ఎంత పట్టుకున్నారు?

ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నాటి నుండి హైదరాబాద్ జిల్లాలో ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు ఇప్పటివరకు రూ.38 లక్షల నగదు సీజ్ చేశాయి. పోలీస్ అధికారులు రూ.47,91,800 నగదుతో పాటు రూ.19,06,089 విలువ గల ఇతర వస్తువులు సీజ్ చేసినట్లు ఎన్నికల అధికారులు చెప్పారు. నగదు, ఇతర వస్తువులపై 46  ఫిర్యాదులు రాగా, వాటిని పరిశీలించి అన్నింటిని పరిష్కరించామని వివరించారు. ఇప్పటివరకు 34 ఎఫ్ఐఆర్‌లు నమోదు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ వివరించారు.

హైదరాబాద్ మహానగరంలో ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు అధికారులు. ప్రత్యేక బృందాలతో అనుమానం ఉన్న వాహనాలు, వ్యక్తులను తనిఖీ చేస్తున్నారు. పెద్ద మొత్తంలో నగదు తీసుకెళ్తుండంగా వివరాలు సేకరించి సరైన ఆధారాలు లేకపోతే సీజ్ చేస్తున్నారు. 50 వేల కంటే అదనంగా నగదు క్యారీ చేస్తే అనుబంధ పత్రాలు చూపించాల్సి ఉంటుందని ఎన్నికల అధికారులు పేర్కొన్నారు.

 మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…