AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Singer Harini Father: రూ. 150 కోట్ల డీల్!.. సింగర్‌ హరిణి ఫాదర్‌ మృతి వెనుక మిస్టరీ ఇదేనా..?

Singer Harini Father: ప్లే బ్యాక్‌ సింగర్‌ హరిణి ఫాదర్‌ ఏకే రావు మర్డర్‌ మిస్టరీకి సంబంధించి సంచలన విషయాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి.

Singer Harini Father: రూ. 150 కోట్ల డీల్!.. సింగర్‌ హరిణి ఫాదర్‌ మృతి వెనుక మిస్టరీ ఇదేనా..?
Shiva Prajapati
| Edited By: Rajeev Rayala|

Updated on: Nov 27, 2021 | 8:41 AM

Share

Singer Harini Father: ప్లే బ్యాక్‌ సింగర్‌ హరిణి ఫాదర్‌ ఏకే రావు మర్డర్‌ మిస్టరీకి సంబంధించి సంచలన విషయాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. మిస్టరీని చేధించే పనిలో పడ్డ బెంగళూరు పోలీసులు.. ఈ మరణం వెనుక రూ. 150 కోట్ల రియల్ ఎస్టేట్ డీల్ ఉన్నట్లు గుర్తించారు. ఈ కేసులో గిరీష్‌ అనే వ్యక్తి స్టేట్‌మెంట్‌ని రికార్డు చేసిన సిద్దగుంట పాళీ పోలీసులు.. 150 కోట్ల రియల్‌ఎస్టేట్‌ డీల్‌పై విచారణ చేపట్టారు. అటు కుటుంబసభ్యుల స్టేట్‌మెంట్‌ను కూడా రికార్డు చేశారు. డానియల్‌ ఆర్మ్‌ స్ట్రాంగ్‌, వివేకానంద, రాఘవన్‌లపై ఏకే రావు కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. ఏకే రావును వేధించిన వ్యక్తులపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఏకే రావు సెల్‌ఫోన్‌ డేటా సేకరించి వాస్తవాలను వెలుగులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు.

కాగా, పోలీసులు అంచనా ప్రకారం.. ఏకే రావుకి, గిరీష్ అనే వ్యక్తికి మధ్య రూ. 150 కోట్ల రియల్ ఎస్టేట్‌ లోన్ డీల్‌ కుదిరింది. ఈ మొత్తాన్ని డానియల్ ఆర్మ్‌ స్ట్రాంగ్‌, వివేకానంద, రాఘవన్‌ల నుంచి ఇప్పిస్తానని ఏకే రావు హామీనిచ్చాడు. ఈ డీల్‌లో భాగంగా గిరీష్‌ మూడుకోట్ల రూపాయలు అడ్వాన్స్‌ కింద ఇచ్చాడు. కానీ ఆ తర్వాత ఈ డీల్‌ ముందుకెళ్లలేదు. ఇందులోభాగంగా ఏకేరావుపై గిరీష్‌ ఒత్తిడి తెచ్చాడని.. ఈ క్రమంలోనే సూసైడ్ జరిగినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.

హైదరాబాద్‌లోని శ్రీనగర్ కాలనీలో నివాసముండే హరిణిరావు కుటుంబం.. వారం రోజులుగా కనిపించడం లేదు. సెల్‌ఫోన్స్‌ స్విచాఫ్‌ రావడం.. పోలీసుల దర్యాప్తు కొనసాగుతుండగానే హరిణి రావు తండ్రి డెడ్‌బాడీ రైల్వే ట్రాక్‌పై పడి ఉండడం.. అంతా మిస్టరీగా మారింది. అసలేం జరిగిందని పోలీసులు కూపీలాగితే రియల్ డీల్ బయటికొచ్చింది. ఈ మొత్తం వ్యవహారంపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

Also read:

గ్యాస్‌ సమస్య తరచూ వేధిస్తోందా.. నిర్లక్ష్యం చేస్తే ఎంత ప్రమాదమో తెలుసా..?

Rainfall: దక్షిణ భారతదేశంలో వర్షాల బీభత్సం.. ఒక్క నవంబర్‌లోనే 143.4 శాతం వానలు..

Corona Effect: వారి కుటుంబాల పునరావసం కోసం దాఖలైన పిటిషన్ పై కేంద్ర స్పందన కోరిన సుప్రీం కోర్టు