తెలంగాణలో త్వరలో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 80 సీట్లకు ఒక్క సీటు తగ్గినా ఏ శిక్షకైనా సిద్ధం అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. బుధవారం నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో జరిగిన విజయభేరి జనసభలో రేవంత్ రెడ్డి ప్రసంగించారు. ‘కేసీఆర్ కు పదవి పోతుందన్న భయంపట్టుకుంది. కాంగ్రెస్ కు 20 సీట్లు కూడా రావని కేసీఆర్ మాట్లాడుతున్నారు. నిజామాబాద్ సాక్షిగా కేసీఆర్ కు చెబుతున్నా.. 80 సీట్ల కంటే ఒక్క సీటు తగ్గకుండా ప్రజలు కాంగ్రెస్ ను గెలిపిస్తారు. 80కి ఒక్క సీటు తగ్గినా ఏ శిక్షకైనా సిద్ధం’ అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ‘కేసీఆర్ గుర్తుపెట్టుకో.. నీ దొరల రాజ్యాన్ని, దొంగల రాజ్యాన్ని పొలిమేరల వరకు తరిమి కొట్టి బరాబర్ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యాన్ని ఏర్పాటు చేస్తాం’ అని సవాల్ విసిరారు రేవంత్ రెడ్డి. ఇందిరమ్మ రాజ్యం అంటే గరీబోళ్ల రాజ్యం. బీఆర్ఎస్ అంటే దొరల రాజ్యం, దొంగల రాజ్యం. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తానని కేసీఆర్ ఊహాలోకంలో ఉంచారు. ఆయన మాత్రం 150 రూముల బంగ్లా కట్టుకున్నాడని విమర్శించారు టీపీసీసీ చీఫ్.
మరిన్ని తెలంగాణ ఎన్నికల వార్తల కోసం క్లిక్ చేయండి..