ధరణిని తీసేస్తే దళారీల రాజ్యం వస్తుంది.. పరిగి సభలో కేసీఆర్ కీలక వ్యాఖ్యలు..
పరిగి సభలో కీలక వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్. రైతు తన సొంత పెట్టుబడితో వ్యవసాయం చేసుకున్న రోజే బంగారు తెలంగాణ అన్నారు. మీ దయతో ఇప్పటికే రెండు సార్లు ముఖ్యమంత్రిని అయ్యానని.. తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో నెంబర్ వన్ కావాలన్నదే తన లక్ష్యమన్నారు గులాబీ బాస్.

పరిగి సభలో కీలక వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్. రైతు తన సొంత పెట్టుబడితో వ్యవసాయం చేసుకున్న రోజే బంగారు తెలంగాణ అన్నారు. మీ దయతో ఇప్పటికే రెండు సార్లు ముఖ్యమంత్రిని అయ్యానని.. తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో నెంబర్ వన్ కావాలన్నదే తన లక్ష్యమన్నారు గులాబీ బాస్. వచ్చే ఏడాదిలో మిషన్ మోడ్‌లో ఇళ్లు నిర్మిస్తామని ప్రకటించారు కేసీఆర్. ఒకటే రోజు అన్నీ కావని.. ఒకటి తర్వాత ఒకటి చేసుకుంటూ పోతున్నామన్నారు. తాండూరు, కొడంగల్, మహబూబ్‌నగర్ అశీర్వాద సభల్లోనూ ప్రసంగించిన కేసీఆర్.. మేనిఫెస్టో, అభివృద్ధిని వివరించడంతో పాటు ప్రతిపక్షాలకు కౌంటర్లు ఇచ్చారు. ధరణిని తీసేస్తే దళారీల రాజ్యం.. పైరవీకారుల రాజ్యం.. పట్వారీల రాజ్యం వస్తుందన్నారు. మంచి వాళ్లు గెలిస్తేనే మంచి జరుగుతుందని.. అన్ని ఆలోచించి ఓటు వేయాలని ప్రజలను కోరారు.
