Telangana Elections: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన నాటి నుంచి కాంగ్రెస్ దూకుడు పెంచింది. ఆరు గ్యారెంటీల హామీలతో ప్రజల్లోకి దూసుకెళ్తోంది. ఈ తరుణంలో తెలంగాణ కాంగ్రెస్ అధినేత రేవంత్ రెడ్డి ఓ దివ్యాంగురాలికి హామీనిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మరుక్షణమే తొలి ఉద్యోగం నీకే ఇస్తానంటూ హామీనిచ్చారు. అసలేం జరిగిందంటే.. హైదరాబాద్ నాంపల్లికి చెందిన దివ్యంగురాలు రజినీ అనే దివ్యాంగురాలు మంగళవారం రేవంత్ రెడ్డిని కలిసి తనకు ఉద్యోగం ఇప్పించాలంటూ కోరింది. ఆమె మాటలను విన్న రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తొలి ఉద్యోగం నీకే ఇస్తానంటూ హామీ ఇచ్చారు. పీజీ పూర్తి చేసినా ఉద్యోగం రాలేదని.. రజనీ గాంధీ భవన్ కు చేరుకుని రేవంత్ రెడ్డిని కలిసింది. ప్రభుత్వ ఉద్యోగం లేదని.. తన కు ప్రైవేట్ సంస్థల్లో కూడా ఉద్యోగం ఇవ్వడం లేదని తన ఆవేదనను రేవంత్ కు చెప్పింది.. ఆమె బాధ విన్న తరువాత రేవంత్ రజనీకి భరోసా ఇచ్చారు.
డిసెంబర్ 9న ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం ఉంటుందని.. సోనియా రాహుల్, మల్లికార్జున ఖర్గే వస్తారు.. అదే రోజు కాంగ్రెస్ పార్టీ నీకు ఉద్యోగం ఇస్తుందని హామీ ఇచ్చారు. ఇది నా గ్యారంటీ అని హామీ ఇచ్చిన రేవంత్.. స్వయంగా కాంగ్రెస్ గ్యారంటీ కార్డును రజినీ పేరుతో నింపి ఇచ్చారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు.. ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..