Telangana: సోనియాతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ అయ్యే ఛాన్స్… BC రిజర్వేషన్లు, కులగణన అజెండాతో ఢిల్లీ టూర్..!
తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఇవాళ మధ్యాహ్నం ఢిల్లీకి వెళ్లనున్నారు. రేవంత్‌రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సహా ఇతర మంత్రులు హస్తిన బాట పట్టనున్నారు. BC రిజర్వేషన్లు, కులగణన అజెండాతో ఢిల్లీ టూర్ ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇవాళ సోనియాతో సీఎం రేవంత్...

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఇవాళ మధ్యాహ్నం ఢిల్లీకి వెళ్లనున్నారు. రేవంత్‌రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సహా ఇతర మంత్రులు హస్తిన బాట పట్టనున్నారు. BC రిజర్వేషన్లు, కులగణన అజెండాతో ఢిల్లీ టూర్ ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇవాళ సోనియాతో సీఎం రేవంత్ సమావేశం అయ్యే అవకాశం ఉంది. రేపు ఖర్గే, రాహుల్‌తో సీఎం బృందం సమావేశం కానుంది. నేతలకు కులగణనపై నిపుణుల కమిటీ నివేదిక అందించనున్నారు సీఎం. రేపు సాయంత్రం 5 గంటలకు ఇందిరాభవన్‌లో 100 మంది కాంగ్రెస్ ఎంపీలకు..పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.
తెలంగాణలో చేపట్టిన కుల గణన, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశాన్ని ఢిల్లీ పెద్దలకు రేవంత్‌రెడ్డి బృందం వివరించనుంది. రిజర్వేషన్ల అంశంపై పార్లమెంట్‌లో గళమెత్తాలని ఖర్గే, రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ ఎంపీలను రేవంత్‌రెడ్డి కోరనున్నారు. అనంతంర పలువురు కేంద్రమంత్రులను కూడా రేవంత్ రెడ్డి అండ్ టీం కలిసే అవకాశం ఉంది.
ఇటీవల కులగణన సర్వేపై తెలంగాణ ప్రభుత్వానికి నిపుణుల కమిటీ కీలక రిపోర్ట్ అందజేసింది. వివిధ అంశాల వారీగా సర్వే వివరాలను సమగ్రంగా విశ్లేషించి 300 పేజీల నివేదికను సమర్పించింది. తెలంగాణ కులగణన దేశానికి రోల్ మోడల్‌గా మారుతుందని నిపుణుల కమిటీ అభిప్రాయపడింది. అటు.. వెనుకబాటుతనంలో అర్బన్, రూరల్ ఏరియాల మధ్య వ్యత్యాసాలకు కారణాలపై అధ్యయనం చేయాలని రేవంత్ ప్రభుత్వం నిపుణుల కమిటీని ఆదేశించింది.
తెలంగాణ నిర్వహించిన సర్వే చరిత్రాత్మకమని, దేశానికి రోల్ మోడల్‌గా మారుతుందని నిపుణుల కమిటీ అభిప్రాయపడింది. కులాల వారీగా వెనుకబాటుతనాన్ని విశ్లేషించిన కమిటీ.. కొత్త పాలసీలతో పాటు ప్రస్తుత విధానాలను మెరుగుపరిచేందుకు అవసరమైన సూచనలను నివేదికలో పొందుపర్చింది. ఈ సందర్భంగా.. తెలంగాణలో జరిగిన కులగణన కేవలం డేటా సేకరణ కాదని.. ఇది తెలంగాణ మెగా హెల్త్ చెకప్‌గా సీఎం రేవంత్‌రెడ్డి అభివర్ణించారు. రాహుల్ మాట ప్రకారం కులగణన చేశామని.. తెలంగాణలోని బీసీల అభ్యున్నతికి, సామాజిక న్యాయం అమలు చేసేందుకు కులగణన ఉపయోగపడుతుందన్నారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ టూర్ ప్రాధాన్యతను సంతరించుకుంది.
