AP-Telangana: రాజకీయాలకు వేదికగా మారిన గణతంత్ర వేడుకలు.. తెలంగాణలో ఇలా-ఆంధ్రాలో అలా..

|

Jan 26, 2023 | 10:07 PM

తెలంగాణ గవర్నర్‌ తమిళిసై నిర్వహించిన ఎట్‌ హోం కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు కాలేదు. అటు ఏపీలో కూడా ఇదే తరహాలో గణతంత్ర వేడుకలకు విపక్షాలు డుమ్మా..

AP-Telangana: రాజకీయాలకు వేదికగా మారిన గణతంత్ర వేడుకలు.. తెలంగాణలో ఇలా-ఆంధ్రాలో అలా..
At Home Celebrations In Telugu States
Follow us on

తెలుగు రాష్ట్రాలలో గణతంత్రం కాస్తా రణతంత్రంగా మారింది. రిపబ్లిక్ డే వేడుకలు కూడా పొలిటికల్ టర్న్‌ తీసుకున్నాయి..! తెలంగాణ గవర్నర్‌ తమిళిసై నిర్వహించిన ఎట్‌ హోం కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు కాలేదు. అటు ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇదే తరహాలో గణతంత్ర వేడుకలకు విపక్షాలు డుమ్మా కొట్టాయి. గురువారం భారతదేశ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా హైదరాబాద్‌‌లోని రాజ్‌భవన్‌లో ఎట్‌హోమ్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు గవర్నర్‌ తమిళిసై. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ సహా మంత్రులెవరూ హాజరు కాలేదు.

అయితే ఈ కార్యక్రమానికి బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌, మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్, సీఎస్, డీజీపీ హాజరయ్యారు. రాజ్‌భవన్‌లో జరిగిన గణతంత్ర వేడుకల్లో జెండాను ఆవిష్కరించారు గవర్నర్ తమిళిసై. అనంతరం పుదుచ్చేరికి వెళ్లారు. సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు సీఎం కేసీఆర్. ఆ తర్వాత ప్రగతిభవన్‌లో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్ సంగతీ అంతే..

మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ రాజ్‌భవన్‌లో జరిగిన ఎట్‌ హోం కార్యక్రమానికి సీఎం జగన్‌, హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా, పలువురు అధికారులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి  ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ, జనసేన, బీజేపీతోపాటు ఇతర ప్రతిపక్షాల నుంచి కూడా ఎవరూ రాలేదు. ఎట్‌హోంకు వచ్చిన వారి దగ్గరికి వెళ్లి పేరుపేరునా అందరినీ పలుకరించారు ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌ హరిచందన్‌. అలాగే విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు ఏపీ పాలకులు. గవర్నర్‌ బిశ్వభూషన్‌ హరిచందన్‌ జాతీయ జెండా ఎగురేసి.. త్రివిధ దళాల గౌరవ వందనాన్ని స్వీకరించారు. వేడుకల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌ పాల్గొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించే శకటాలను ప్రదర్శించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..