Telangana Corona: తెలంగాణకు ఉపశమనం.. భారీగా తగ్గిన కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు..

Telangana Corona: తెలంగాణలో ఇవాళ కరోనా పాజిటివ్ కేసులు ఆరు వందలకు దిగువన నమోదు అయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన...

Telangana Corona: తెలంగాణకు ఉపశమనం.. భారీగా తగ్గిన కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు..
Corona

Updated on: Jul 18, 2021 | 6:51 PM

Telangana Corona: తెలంగాణలో ఇవాళ కరోనా పాజిటివ్ కేసులు ఆరు వందలకు దిగువన నమోదు అయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 90,966 సాంపిల్స్ పరీక్షించగా.. 578 మందికి పాజిటివ్‌గా నిర్ధారించారు వైద్యాధికారులు. ఇక కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య పాజిటివ్ సంఖ్య కంటే ఎక్కువగానే నమోదైంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 731 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇదే సమయంలో కరోనా వైరస్ ప్రభావంతో ఇవాళ ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన కరోనా బులెటిన్ ప్రకారం.. తెలంగాణలో ఇప్పటి వరకు 6,36,627 మంది కరోనా బారిన పడగా.. 6,23,044 మంది కోలుకున్నారు. ఇక కరోనా వైరస్ ప్రభావంతో.. 3,759 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 9,824 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఇదిలాఉంటే.. తెలంగాణలో కరోనా పాజిటివ్ రేటు 1.55 శాతం ఉండగా.. రికవరీ రేటు 97.86 శాతం, మరణాల రేటు 0.59 శాతంగా ఉంది.

తెలంగాణలో ఇవాళ నమోదైన పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 75 కేసులు నమోదు అయ్యాయి. ఆ తరువాతి స్థానంలో 53 కేసులతో కరీంనగర్‌ నిలచింది. జిల్లాల వారీగా నమోదైన కరోనా కేసులు వివరాలు చూసుకున్నట్లయితే.. ఆదిలాబాద్ 5, బద్రాద్రి కొత్తగూడెం 14, జగిత్యాల 21, జనగామ 13, జయశంకర్ భూపాలపల్లి 16, జోగులాంబ గద్వాల 3, కామారెడ్డి 0, కరీంనగర్ 53, ఖమ్మం 43, కొమరంభీం ఆసిఫాబాద్ 0, మహబూబ్‌నగర్ 14, మహబూబాబాద్ 15, మంచిర్యాల 36, మెదక్ 5, మేడ్చల్ మల్కాజిగిరి 21, ములుగు 10, నాగర్ కర్నూల్ 7, నల్లగొండ 25, నారాయణ పేట 1, నిర్మల్ 2, నిజామాబాద్ 7, పెద్దపల్లి 32, రాజన్న సిరిసిల్ల 15, రంగారెడ్డి 16, సంగారెడ్డి 9, సిద్దిపేట 12, సూర్యాపేట 38, వికారాబాద్ 3, వనపర్తి 9, వరంగల్ రూరల్ 16, వరంగల్ అర్బన్ 36, యాదాద్రి భువనగిరి 6 పాజిటివ్ కేసుల చొప్పున నమోదు అయ్యాయి.

Also read:

Gold: భారత్‌కు బంగారం అత్యధికంగా ఆ దేశం నుంచే వస్తోంది.. పుత్తడి దిగుమతిలో భారత్‌ నాలుగో స్థానం

Nagendra Babu: బాలయ్య కామెంట్స్‌కి .. మెగా బ్రదర్‌ నాగబాబు కౌంటర్‌..!! వీడియో

Karthika Deepam: వంటలక్క ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. కార్తీక దీపం సీరియల్ ఇప్ప్పుడపుడే అవ్వదట.. సీక్వెల్ కూడా ప్లాన్