AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

HDFC Bank Car Loan: ఆ పరికరాన్ని కొనుగోలు చేసిన వారందరికీ రీఫండ్; అకౌంట్‌లో జమచేస్తామన్న బ్యాంక్!

భారతదేశ అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్‌లోన్ కస్టమర్లు కొనుగోలు చేసిన జీపీఎస్ పరికాలకు తిరిగి డబ్బును చెల్లించనుంది.

HDFC Bank Car Loan: ఆ పరికరాన్ని కొనుగోలు చేసిన వారందరికీ రీఫండ్; అకౌంట్‌లో జమచేస్తామన్న బ్యాంక్!
Hdfc
Follow us
Venkata Chari

|

Updated on: Jun 17, 2021 | 8:46 PM

HDFC Bank Car Loan: భారతదేశ అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్‌లోన్ కస్టమర్లు కొనుగోలు చేసిన జీపీఎస్ పరికాలకు తిరిగి డబ్బును చెల్లించనుంది. ఈ మేరకు నేడు ఓ ప్రకటనను విడుదల చేసింది. అప్పట్లో ఈ వ్యవహారం పలు వివాదాలకు దారి తీయడంతో.. ఆర్‌బీఐ రంగంలోకి దిగి హెచ్‌డీఎఫ్‌సీకి జరిమానా కూడా విధించింది. అసలు విషయంలోకి వెళ్తే.. 2014 నుంచి 2020 వ సంవత్సరాల మధ్యలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ నుంచి కార్ లోన్‌ తీసుకున్నారు కొందరు కస్టమర్లు. అయితే వీరంతా కచ్చితంగా ట్రాకింగ్ పరికాన్ని కొనుగోలు చేయాలని బ్యాంక్ ఆదేశించింది. దీంతో చాలామంది కస్టమర్లు తప్పని పరిస్థితిలో జీపీఎస్ ట్రాకింగ్ పరికరాన్ని కొనుగోలు చేయాల్సి వచ్చింది. ఈ మేరకు ఒక్కో కస్టమర్‌ పై అధికంగా రూ. 18,000 నుంచి రూ.19,500 వరకు భారం పడింది. ఈ పరికరాన్ని ముంబైకి చెందిన ట్రాక్ పాయింట్ జీపీఎస్ విక్రయించింది. బ్యాంక్ ఎగ్జిక్యూటివ్‌ల ఒత్తిడితోనే ఈ జీపిఎస్ పరికరాన్ని కొనుగోలు చేసినట్లు పలు ఫిర్యాదులు వచ్చాయి.

అయితే ఆర్థికేతర వ్యాపారాల నుంచి బ్యాంకులను నిషేధిస్తూ ఆర్‌బీఐ ఉత్తర్వులు జారీ చేయడంతో.. ఎట్టకేలకు బ్యాంక్ దిగివచ్చింది. దీంతో పరికారాన్ని కొనుగోలు చేసిన కస్టమర్లందరికీ డబ్బులు తిరిగి ఇచ్చేందుకు హెచ్‌డీఎఫ్‌సీ అంగీకరించింది. ఈమేరకు సోషల్ మీడియాలో ఓ ప్రకటన చేసింది. రీఫండ్ మనీ కస్టమర్ల అకౌంట్‌లో తిరిగి జమ చేస్తామని అందులో వెల్లడించింది.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఆటో లోన్ కస్టమర్లకు వాహన-ట్రాకింగ్ పరికరాలను విక్రయించినందుకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌‌కు రూ. 10 కోట్ల జరిమానా విధించిది. ఈమేరకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అంతర్గతంగా విచారణ చేసి, సంబంధిత ఉద్యోగులపై చర్యలు తీసునున్నట్లు తెలుస్తోంది.