Telangana: ఆ రోజు బాత్‌రూమ్‌లోకి వెళ్లి ఏడ్చాను.. భావోద్వేగానికి గురైన రాజ గోపాల్‌ రెడ్డి.

తెలగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్‌ రెడ్డి శుక్రవారం బాధ్యతలు స్వీకరంచిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి హాజరైన మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. కిషన్‌ రెడ్డి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకరం చేయడంతో బీజేపీ కార్యాలయంలో సందడి వాతావరణం నెలకొంది. అయితే ఇదే సమయంలో...

Telangana: ఆ రోజు బాత్‌రూమ్‌లోకి వెళ్లి ఏడ్చాను.. భావోద్వేగానికి గురైన రాజ గోపాల్‌ రెడ్డి.
Raja Gopal Reddy

Edited By:

Updated on: Jul 21, 2023 | 3:13 PM

తెలగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్‌ రెడ్డి శుక్రవారం బాధ్యతలు స్వీకరంచిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి హాజరైన మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. కిషన్‌ రెడ్డి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకరం చేయడంతో బీజేపీ కార్యాలయంలో సందడి వాతావరణం నెలకొంది. అయితే ఇదే సమయంలో రాజ గోపాల్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అక్కడనున్న వారిని ఆశ్చర్యానికి గురి చేశాయి.

బండి సంజయ్‌ని రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తొలగించిన సమయంలో.. ఆయనను చూసి కన్నీళ్లు వచ్చాయన్న రాజగోపాల్‌ రెడ్డి, ఆ సమయంలో బాత్రూంకి వెళ్లి ఏడ్చానంటూ ఆవేదను వ్యక్తం చేశారు. బండి సంజయ్ రాజి లేని పోరాటం చేసి పార్టీకి ఊపు తెచ్చిన వ్యక్తి అన్నారు. బండి సంజయ్ విషయంలో తనకు బాధ కలిగిందని చెప్పుకొచ్చారు. బండి సంజయ్ అధ్యక్షుడుగా రాజీ లేనీ పోరాటం చేసిన నాయకుడు అన్నారు.

ఇక అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా అందరం కట్టుబడి ఉంటామన్న రాజగోపాల్‌.. కానీ బండి సంజయ్‌ని గుండెల్లో పెట్టుకొని చూసుకోవాలన్నారు. రాజాగోపాల్‌ రెడ్డి.. బండి సంజయ్‌ పేరును ప్రస్తావించగానే సభా ప్రాంగణంలో ఒక్కసారిగా షర్షధ్వనాలు చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..