Telangana Rains: హైద‌రాబాద్‌లోని ప‌లు చోట్ల వ‌ర్షం.. తెలంగాణలో మరో 3 రోజులో ఇదే పరిస్థితి..

|

May 21, 2023 | 6:40 PM

Telangana Rains: హైద‌రాబాద్‌ని మళ్లీ వరుణుడు చుట్టుముట్టేలా ఉన్నాడు. ఇప్పటికే ఆదివారం నగరంలోని ప‌లు ప్రాంతాలలో వ‌ర్షం కురిసింది. మరోవైపు వర్షం పడుతుండగానే ఎండతో కూడిన వింత వాతావ‌ర‌ణం చోటు చేసుకుంది. ఆదివారం బంజారాహిల్స్, జూబ్లిహిల్స్, అమీర్ పేట్ సహా..

Telangana Rains: హైద‌రాబాద్‌లోని ప‌లు చోట్ల వ‌ర్షం.. తెలంగాణలో మరో 3 రోజులో ఇదే పరిస్థితి..
Rains Forecast
Follow us on

Telangana Rains: హైద‌రాబాద్‌ని మళ్లీ వరుణుడు చుట్టుముట్టేలా ఉన్నాడు. ఇప్పటికే ఆదివారం నగరంలోని ప‌లు ప్రాంతాలలో వ‌ర్షం కురిసింది. మరోవైపు వర్షం పడుతుండగానే ఎండతో కూడిన వింత వాతావ‌ర‌ణం చోటు చేసుకుంది. ఆదివారం బంజారాహిల్స్, జూబ్లిహిల్స్, అమీర్ పేట్ సహా పాటు ప‌లు ప్రాంతాల్లో వ‌ర్షం కురిసింది. ఇదిలా ఉండ‌గానే ఉప‌రిత‌ల‌ ద్రోణి ప్ర‌భావంతో రాష్ట్రంలోని ప‌లుచోట్ల వ‌ర్షాలు కురిసే అవ‌కాశముంద‌ని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు రాగల 3 రోజుల పాటు రాష్ట్రంలో పలు జిల్లాల్లో తేలిక పాటి మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఈ మేరకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది.

వాతావరణ శాఖ నివేదికల ప్రకారం ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకు ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, యాదాద్రి భువనగిరి, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని పేర్కొంది. అలాగే మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, హైదరాబాద్‌, మెదక్‌, కామారెడ్డి, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి జిల్లాల్లో ఈదురుగాలులతో వానలు కురుస్తాయి.

అలాగే సోమవారం నుంచి మంగళవారం వరకు ఆదిలాబాద్‌, కొమురం భీమ్, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తూ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది. ఇదే విధంగా మంగళవారం నుంచి బుధవారం ఉదయం వరకు ఉమ్మడి ఆదిలాబాద్‌, వరంగల్‌, ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్‌ జిల్లాలతో పాటు వికారాబాద్‌, మెదక్‌, వనపర్తి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..