వాగులో చిక్కుకున్న భార్యను చాకచక్యంగా కాపాడిన భర్త.. ఆదిలాబాద్ జిల్లాలో సినీ ఫక్కీ దృశ్యాలు
తెలంగాణలో వానలు మళ్లీ దంచికొడుతున్నాయి. మహారాష్ట్ర సహా ఎగువ కురుస్తున్న వర్షాలకు తెలంగాణ సరిహద్దు జిల్లాలు మంచిర్యాల, నిర్మల్ జిల్లాలతో పాటు భైంసాలో భారీ వర్షాలు పడుతున్నాయి.
Rains In Telangana: తెలంగాణలో వానలు మళ్లీ దంచికొడుతున్నాయి. మహారాష్ట్ర సహా ఎగువ కురుస్తున్న వర్షాలకు తెలంగాణ సరిహద్దు జిల్లాలు మంచిర్యాల, నిర్మల్ జిల్లాలతో పాటు భైంసాలో భారీ వర్షాలు పడుతున్నాయి. వర్షాలకు గడ్డేన్నవాగు ప్రాజెక్టుకు భారీగా వరదనీరు చేరుతోంది. గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. ముంపు ప్రాంతాలైన బైంసాలో ఆట్ నగర్ సబ్ వే ను తాత్కాలికంగా మూసివేశారు. 72 గంటల పాటు భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నందున.. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు జారీ చేశారు.
అటు, కోటపల్లి మండలంలోని నక్కలపల్లి గ్రామంలో వాగు ఉప్పొంగి 5 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఉప్పొంగిన వాగు దాటడానికి నానా ఆవస్థలు పడుతున్నారు స్థానికులు. తాడు సహాయంతో అటు నుంచి ఇటు.. ఇటు నుంచి ఆటు తప్పనిసరి పరిస్థితుల్లో వాగుదాటుతున్నారు వ్యవసాయ కూలీలు.
సినిమాల్లో దృశ్యాల మాదిరిగా భార్య బరువును మోస్తూ వాగు ఇటు తీరానికి తీసుకొచ్చాడు ఒక వ్యవసాయ కూలీ. ఏటా ఇదే ప్రాంతంలో బ్రిడ్జ్ పెద్ద సమస్యగా మారిపోయిందని స్థానికులు ఆవేదన వెలిబుచ్చుతున్నారు. అటు, తెలంగాణ అంతటా వర్షాలు ఇవాళ జోరుగానే పడుతున్నాయి. మహబూబాబాద్ జిల్లాలో సైతం దంచి కొడుతున్నాయి వానలు. గూడూరు మండలం మట్టెవాడ – తిమ్మాపురం మధ్య ఉప్పొంగి ప్రవహిస్తోంది వాగు.
పొలం పనికి వెళ్లి.. వాగుకి ఆటు వైపు సుభద్ర అనే మహిళ చిక్కుకుపోయింది. పొంగిపొర్లుతున్న వాగులో ఈదుకుంటూ వెళ్లిన మహిళ భర్త.. తాడు సహాయంతో భార్యను సురక్షితంగా ఒడ్డుకు చేర్చుకోగలిగాడు. గూడూరు మండలం మట్టెవాడ గ్రామపంచాయతీ పరిధిలో జరిగింది ఈ ఘటన. ఇలా తాడు సహాయంతో బ్రిడ్జ్ దాటే సన్నివేశాలు నిత్యకృత్యమేనని స్థానికులు వాపోతున్నారు. బ్రిడ్జిని నిర్మించాలంటూ ప్రభుత్వానికి టీవీ9 ముఖంగా డిమాండ్ చేస్తున్నారు స్థానికులు.
Read also: OMG: కూర్చున్నచోట కూర్చున్నట్లే.. గుండెపోటుతో కానిస్టేబుల్ హఠాన్మరణం