తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేని వర్షాలు.. ఉగ్రరూపం దాల్చిన గోదారి.. లోతట్టు ప్రాంతాల ప్రజలకు హెచ్చరిక.!
ఉపనదులు ఉప్పొంగుతున్నాయి.. గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది. నదీ పరివాహక ప్రాంతంలో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. వాగులు, వంకలు ఉథృతంగా ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని మరీ కాలం వెళ్లదీస్తున్నారు. అటు భద్రాద్రిలో మళ్లీ ముంపు భయం వెంటాడుతోంది. ఇప్పటికే ఊరూవాడ తడిసిముద్దయ్యాయి. ప్రధాన నదులతో పాటు.. ఉపనదుల పొంగి పొర్లడంతో గ్రామాలు, పట్టణాలు నీటమునిగాయి.
ఉపనదులు ఉప్పొంగుతున్నాయి.. గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది. నదీ పరివాహక ప్రాంతంలో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. వాగులు, వంకలు ఉథృతంగా ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని మరీ కాలం వెళ్లదీస్తున్నారు. అటు భద్రాద్రిలో మళ్లీ ముంపు భయం వెంటాడుతోంది. ఇప్పటికే ఊరూవాడ తడిసిముద్దయ్యాయి. ప్రధాన నదులతో పాటు.. ఉపనదుల పొంగి పొర్లడంతో గ్రామాలు, పట్టణాలు నీటమునిగాయి. హనుమకొండ నీటికుండలా మారింది. భారీవర్షాలకు నిర్మల్ జిల్లా భైంసా పట్టణం నీట మునిగింది. చాలా గ్రామాలకు రాకపోకలు బంధం అయ్యాయి.
భద్రాచలం – కొత్తగూడెం మధ్య వాహనాలకు కిన్నెరసాని బ్రేకులేసింది. హైదరాబాద్- వరంగల్ నేషనల్ హైవేను వరద నీరు ముంచెత్తింది. ఉదయం నుంచి వరదలో చిక్కుకున్న భూపాలపల్లి జిల్లా మోరంచపల్లిలో – సహాయకార్యక్రమాలు కొనసాగుతున్నాయి. వరదలో చిక్కుకుపోయిన గ్రామస్తుల్ని బోట్ల ద్వారా , హెలికాప్టర్ల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
తెలంగాణలో రాగల మూడురోజుల పాటు భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో బుధవారం ఏర్పడిన తీవ్ర అల్పపీడనం గురువారం నాటికి బలహీనపడిందని, ప్రస్తుతం దక్షిణ ఒడిశా, పరిసరాల్లోని ఉత్తర ఆంధ్రప్రదేశ్ పరిసరాల్లో కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న తెలిపారు. పలు జిల్లాల్లో రెడ్ అలర్ట్.. మరికొన్ని జిల్లాల్లో పరివాహక ప్రాంతాల్లో పడుతున్న వర్షాలతో ప్రాజెక్టుల్లోకి భారీగా వరద వచ్చిచేరుతోంది. ఇన్‌ఫ్లోస్ గంటగంటకూ పెరుగుతున్నాయి. కడెం ప్రాజెక్టుకు మళ్లీ ప్రమాదకర స్థాయిలో వరద పోటెత్తుతోంది. 16 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసిన అధికారులు.. లోతట్టు ప్రాంత ప్రజలను అలర్ట్ చేశారు.
భద్రాచలం దగ్గర కూడా గోదావరి ఉగ్రరూపం దాల్చింది. రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. 48 అడుగులకుపైగానే మరో మూడురోజుల పాటు భారీ వర్షాలు పడతాయన్న హెచ్చరికల నేపథ్యంలో ప్రాజెక్టుల భద్రత ఒక్కసారిగా చర్చనీయాంశం అయింది. స్థాయికి మించి కడెం వద్ద వరద వస్తోంది. ఇలాంటి పరిస్థితి మిగతా ప్రాజెక్టులకు వస్తే తట్టుకునే శక్తి వాటికి ఉందా? రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్వహణ ఇప్పుడు ప్రధాన చర్చ నీయాంశం అయింది.