Watch Video: నీట మునిగిన భైంసా ఆర్టీసీ డిపో.. బస్సుపై చిక్కుకున్న ఆర్టీసీ సిబ్బంది.. షాకింగ్ దృశ్యాలు
Telangana Heavy Rains: తెలంగాణ వ్యాప్తంగా అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు వంకలు, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. లోటత్తు జలమయం అయ్యాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగానూ కుండపోత వర్షాలు కురుస్తుండటంతో పలు లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి.
Telangana Floods: తెలంగాణ వ్యాప్తంగా అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు వంకలు, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. లోటత్తు జలమయం అయ్యాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగానూ కుండపోత వర్షాలు కురుస్తుండటంతో పలు లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. నిర్మల్ జిల్లాలోని భైంసా ఆర్టీసి డిపో పూర్తిగా నీట మునిగింది. ఆర్టీసీ డిపోను పూర్తిగా వరదనీరు చుట్టిముట్టింది. వరద నీటిలో 8 మంది ఆర్టీసీ సిబ్బంది చిక్కుకున్నారు. బస్సులపై నిల్చొని సహాయం కోసం ఎదురు చూస్తున్న దృశ్యాలు టీవీ9 కెమరాలకు చిక్కాయి.
భారీవర్షాలకు భైంసా పట్టణంలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. ఆటోనగర్, రాహుల్ నగర్, వినాయక్ నగర్ కుభీర్ చౌరస్తా ఏరియాలో వరదనీరు చేరింది . దీంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. భైంసా గడ్డేన్న వాగు కు భారీ వరద చేరింది. 6 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు… దీంతో భైంసా పట్టణం లోకి వరదనీరు ప్రవేశించింది.