Railway News/IRCTC News: తెలుగు రాష్ట్రాల్లోని రైల్వే ప్రయాణీలకు ఉపయోగపడే కీలక సమాచారమిది. కర్ణాటక హుబ్లీ డివిజన్‌లోని టోర్నగల్లు వద్ద యార్డ్ రీమోడలింగ్ పనుల నేపథ్యంలో గతంలో ఆ మార్గంలో వెళ్లే పలు రైళ్లను సౌత్ వెస్టర్న్ రైల్వేస్ దారిమళ్లించింది. మరికొన్ని రైళ్లను రద్దు చేసింది. సాంకేతిక కారణాలతో గతంలో దారి మళ్లించిన లేదా రద్దు చేసిన ఈ రైళ్లను రైల్వే శాఖ(Indian Railways) పునరుద్ధరించింది. వాటి రైళ్ల వివరాలను దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) బుధవారంనాడు ఓ అధికారిక ప్రకటనలో వెల్లడించింది. గతంలో రద్దు చేసిన హుబ్లీ – విజయవాడ రైలు (నెం.17329)ను ఈ నెల 10 తేదీ నుంచి పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించారు. అలాగే విజయవాడ – హుబ్లీ (నెం.17330) రైలును ఈ నెల 11 తేదీ నుంచి పునరుద్ధిస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.
అలాగే దారి మళ్లించిన యశ్వంత్ పూర్ – హెచ్. నిజాముద్దీన్ (రైలు నెం.12649), హెచ్.నిజాముద్దీన్ – యశ్వంత్‌పూర్ (నెం.12650) రైళ్లను మునుపటి మార్గాల్లోనే నడపుతున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.
అటు నాందేడ్ – మేడ్చల్ (నెంబర్.07971) రైలు షెడ్యూల్లో ఈ నెల 9, 10 తేదీల్లో మార్పులు చేశారు. ఈ రైలు నాందేడ్‌లో వేకువజామున 04.55 గం.లకు బదులుగా 06.35 గం.లకు బయలుదేరి వెళ్లనుంది. ఆ మేరకు మిగిలిన రైల్వే స్టేషన్లలోనూ ఆ రైలు రాకపోకలకు సంబంధించిన సమాయాల్లో మార్పు ఉంటుంది. దీన్ని పరిగణలోకి తీసుకుని రైల్వే ప్రయాణీకులు తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని రైల్వే అధికారులు సూచిస్తున్నారు.
పునరుద్ధరించిన, రీషెడ్యూల్ చేసిన రైళ్ల వివరాలు..
మరిన్ని జాతీయ వార్తలు చదవండి..