రాహుల్ గాంధీ పాదయాత్రకు సర్వం సిద్దం.. కార్యాచరణను ప్రకటించనున్న కాంగ్రెస్..
ప్రజలకు మరింత చేరువయ్యే లక్ష్యంతో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పాదయాత్రకు సిద్దమయ్యారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా ఇటీవల నిర్వహించిన చింతన్ శిబిర్‌లో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది కాంగ్రెస్.
ప్రజలకు మరింత చేరువయ్యే లక్ష్యంతో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పాదయాత్రకు సిద్దమయ్యారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా ఇటీవల నిర్వహించిన చింతన్ శిబిర్‌లో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది కాంగ్రెస్. ఇందులో భాగంగానే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర కొనసాగించాలని రాహుల్ గాంధీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇక ఆ పాదయాత్రను తమ ప్రాంతం నుంచే చేపట్టాలని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు. తాజాగా ఇందిరా భవన్‌లో నిర్వహించిన పీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. అక్టోబర్ 2వ తేదీ నుంచి రాహుల్ గాంధీ చేపట్టబోయే పాదయాత్రను తెలంగాణ నుంచి చేపట్టాలని తీర్మానించారు. తెలంగాణలో జరిగే అన్ని కార్యక్రమాలు వల్ల దేశంలో తెలంగాణ మోడల్‌గా నిలిచిందని రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ మోడల్‌గా డిజిటల్ మెంబెర్‌షిప్, వరంగల్ డిక్లరేషన్ చేపట్టాం.. ఇప్పుడు పాదయాత్ర కూడా తెలంగాణ నుంచి మొదలు పెడదామని పిలుపునిచ్చారు.