TS SSC Exams 2022: తెలంగాణ పదో తరగతి పరీక్షల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు.. ఇవి తప్పనిసరి..

తెలంగాణ పదో తరగతి పరీక్షల నిర్వహణపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Sabita Indrareddy) సోమవారం (మే 16) సమీక్ష నిర్వహించారు. పరీక్షల్లో అక్రమాలకు పాల్పడకుండా పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రతీ పరీక్షా కేంద్రంలోనూ..

TS SSC Exams 2022: తెలంగాణ పదో తరగతి పరీక్షల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు.. ఇవి తప్పనిసరి..
Sabita Indrareddy Review
Follow us
Srilakshmi C

|

Updated on: May 16, 2022 | 5:46 PM

TS Tenth class Exams 2022: తెలంగాణ పదో తరగతి పరీక్షల నిర్వహణపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Sabita Indrareddy) సోమవారం (మే 16) సమీక్ష నిర్వహించారు. పరీక్షల్లో అక్రమాలకు పాల్పడకుండా పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రతీ పరీక్షా కేంద్రంలోనూ సీసీ కెమెరాలను (CCTV Cameras) ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. పొరపాట్లకు తావు లేకుండా పకడ్బందీగా చర్యలు చేపట్టాలని ఈ మేరకు మంత్రి సబితా సూచించారు. కాగా మే 23 నుంచి జూన్ 1 వరకు జరగనున్న పదవ తరగతి పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 5,09,275 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. దాదాపు 2,861 పరీక్షా కేంద్రాల్లో పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. పరీక్షల నిర్వహణ సమయంలో తలెత్తే సమస్యల పరిష్కారానికి వీలుగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయనున్నారు. ఇక రాష్ట్ర విద్యాశాఖ ఇప్పటికే హాల్ టికెట్లను కూడా ఆయా పాఠశాలలకు పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. ఎండ తీవ్రత దృష్ట్యా ప్రతీ పరీక్షా కేంద్రంలో ఒక ఎఎన్ఎం, ఒక ఆశా ఉద్యోగిని అందుబాటులో ఉండే చర్యలు తీసుకుంటున్నారు. ఓఆర్ఎస్ పాకెట్లు, మందులు, తాగు నీరు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకుంటున్నారు.

కాగా ఈ నెల (మే 23) 23 నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభంకానున్న పదో తరగతి పరీక్షలకు బెంచీకొకరు చొప్పున విద్యార్థులను ‘Z’ ఆకారంలో కూర్చోబెట్టేలా చర్యలు తీసుకుంటున్నారు. ఒక్కో పరీక్ష కేంద్రంలోని తరగతి గదికి 12 నుంచి 24 మంది విద్యార్థులు ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. చిన్న గదులైతే 12 మంది.. పెద్ద గదుల్లోనైతే 24 మంది కూర్చునేలా బెంచీలు వేస్తున్నారు. మండుటెండల్లో పరీక్షలు జరగనున్న నేపథ్యంలో అందుకు తగ్గట్లుగా విద్యార్థులు ఇబ్బందులు పడకుండా తగు చర్యలు తీసుకుంటున్నట్లు విద్యాశాఖాధికారులు చెబుతున్నారు. కేంద్రాల ఎంపికలో కరెంట్‌ సదుపాయాలు, తాగునీటి సౌకర్యం ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వివరించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.