Hyderabad Police: కరోనా మహమ్మారి శారీరక ఆరోగ్యాలను ఎంతలా దెబ్బ తీస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే మరోవైపు కరోనా వ్యాధి గురించి జరుగుతోన్న చర్చ, వస్తోన్న పుకార్లు, మరణాల లెక్కలు మానసికంగా ఎంతో క్షోభకు గురి చేస్తున్నాయి. కరోనా వైరస్‌తోనే కాకుండా దాని వల్ల కలిగే భయం వల్ల కూడా మరణిస్తున్నవారున్నారంటేనే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కరోనా మహమ్మారి కారణంగా తీవ్ర మానసిక ఆందోళన కలుగుతోంది. శారీరకంగా అనారోగ్యానికి గురైతే మందులు ఉంటాయి. కానీ మానసిక సమస్యలకు చికిత్స ఎలా.? ఇలానే ఆలోంచిచారు హైదరాబాద్ పోలీసులు.
సామాజిక సేవలో ఎప్పుడూ ముందు వరుసలో ఉండే హైదరాబాద్ పోలీసులు తాజాగా మరో వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. మానసిక అనారోగ్యంతో బాధపడే వారికి అండగా నిలిచే క్రమంలో ఉచితంగా కౌన్సిలింగ్ అందించనున్నారు. ఈ విషయాన్ని రాచకొండ పోలీసులు ట్విట్టర్ వేదికగా అధికారికంగా ప్రకటించారు. మీకు మీరూ మౌనంగా కుమిలి పోకండి. మీ మానసిక సమస్యలను మాతో పంచుకోండి. రాచకొండ సెక్కూరిటీ కౌన్సిల్ భాగస్వామ్యంతో రాచకొండ పోలీసులు.. తెలంగాణ ప్రజలకు కౌన్సిలింగ్ సేవలు అందిస్తున్నాము. మీ రక్షణ మా బాధ్యత అంటూ పోస్ట్ చేశారు. మానసిక సమస్యలను బాహాటంగా చెప్పుకోలేని పరిస్థితుల్లో హైదరాబాద్ పోలీసులు చేపట్టిన ఈ కార్యక్రమం నిజంగానే అభినందనీయం కదూ..!
Don’t suffer in silence, reach out to us- #CP_Rachakonda.#RachakondaPolice in association with @RKSC_Rachakonda launched #PsychoSocial counselling services for all citizens of #Telangana. #YourSafety_OurResponsibility..
हम आपके साथ हैं!!@TelanganaDGP @SwatiLakra_IPS pic.twitter.com/PYI9XPDJss— Rachakonda Police (@RachakondaCop) May 10, 2021
Also Read: SBI: వినియోగదారులకు ఎస్‌బీఐ గుడ్ న్యూస్.. ఆన్‌లైన్‌లోనే బ్రాంచ్ మార్పు.. ఇవిగో వివరాలు
Cashew Benefits: జీడిపప్పును తింటే కలిగే లాభాలు ఎన్నో తెలిస్తే మీరు షాక్ అవుతారు..!
Uranium: ముంబయిలో బయటపడిన అక్రమ యురేనియం..ఆందోళన వ్యక్తం చేస్తున్న పాకిస్తాన్