అధికార పార్టీలో ప్రోటోకాల్ రగడ.. మంత్రి ముందే అలిగిన ఎమ్మెల్యే..!
అతను అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే..! అధికారిక కార్యక్రమాలు కొన్ని జరుగుతున్నాయి. మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి పాల్గొంటున్నారు. అక్కడకు వెళ్లగానే ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేశారు. నేను ప్రారంభించేది లేదంటూ అలకపాన్పు ఎక్కారు. దీంతో కార్యక్రమానికి వచ్చిన వారంతా షాక్ అయ్యారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గంలో వెలుగులోకి వచ్చింది.

అశ్వరావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జారె ఆదినారాయణకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అభివృద్ధి పనుల శంకుస్థాపనకి మంత్రి తుమ్మల నాగేశ్వరరావును ఆహ్వానించారు అధికారులు. సమాచారం తెలుసుకుని అక్కడికి వెళ్లి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే జారె ఆదినారాయణ. దమ్మపేట మండలం పూసికుంట గిరిజన గ్రామాల్లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటనలో రోడ్డు శంకుస్థాపన కార్యక్రమానికి తనకు సమాచారం ఇవ్వకుండా ప్రోటోకాల్ పాటించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే ఆదినారాయణ .
మంత్రి సమక్షంలో శంకుస్థాపన చేయడానికి ఎమ్మెల్యే ఆదినారాయణ మారం చేశారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎంత సముదాయించినా కూడా కొబ్బరికాయ కొట్టనని మొండికేశారు. చివరికి తుమ్మల నచ్చజెప్పి తన కారులో ఎక్కించుకొని మిగిలిన కార్యక్రమాలకు తీసుకెళ్లారు. చివరగా మళ్లీ నిలిచిపోయిన శంకుస్థాపన కార్యక్రమం వద్దకు తీసుకువచ్చి శంకుస్థాపన చేయాలని తుమ్మల కోరగా ఎమ్మెల్యే అనుచరులు శంకుస్థాపన చేయవద్దని అడ్డుకున్నారు. దీంతో కొంత ఘర్షణ వాతావరణం నెలకొనగా, మంత్రి తుమ్మల జోక్యం చేసుకుని లోటు పాట్లు ఏమి ఉన్నా తర్వాత మాట్లాడదామని అందరినీ సముదాయించి శంకుస్థాపన కార్యక్రమం పూర్తి చేశారు.
వీడియో చూడండి..
అధికారిక కార్యక్రమాలు ఏవి ఉన్నా కూడా సర్పంచులకు, ప్రజాప్రతినిధులకు, ఎమ్మెల్యేకు తప్పనిసరిగా వెళ్లి ప్రత్యేకంగా ఆహ్వానించాలని, అధికారులు చేసే అనాలోచిత పనుల వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మళ్లీ ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకూడదని మంత్రి తుమ్మల అధికారులను సున్నితంగా హెచ్చరించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..