Telangana: రాజ ద్రోహం కేసుపై ప్రొఫెసర్‌ హరగోపాల్‌ సంచలన వ్యాఖ్యలు.. పోలీసులు అత్యుత్సాహంతోనే..

|

Jun 16, 2023 | 12:08 PM

తెలంగాణ పోలీసులు పెట్టిన రాజద్రోహం కేసుపై ప్రొఫెసర్‌ హరగోపాల్‌ స్పందించారు. కేసు నమోదుపై టీవీ9 తో మాట్లాడిన ఆయన 152 మందిపై ఉపా చట్టం కింద కేసు పెట్టడం దుర్మార్గమన్నారు. 'పోలీసుల అత్యుత్సాహంతోనే నాపై..

Telangana: రాజ ద్రోహం కేసుపై ప్రొఫెసర్‌ హరగోపాల్‌ సంచలన వ్యాఖ్యలు.. పోలీసులు అత్యుత్సాహంతోనే..
Professor Haragopal
Follow us on

తెలంగాణ పోలీసులు పెట్టిన రాజద్రోహం కేసుపై ప్రొఫెసర్‌ హరగోపాల్‌ స్పందించారు. కేసు నమోదుపై టీవీ9 తో మాట్లాడిన ఆయన 152 మందిపై ఉపా చట్టం కింద కేసు పెట్టడం దుర్మార్గమన్నారు. ‘పోలీసుల అత్యుత్సాహంతోనే నాపై ఉపా చట్టం కింద కేసు పెట్టారు. ప్రభుత్వ పెద్దలకు తెలిసి నాపై కేసు నమోదైందని అనుకోవడం లేదు. నేను ఏ మావోయిస్టును కలిశానో.. ఎక్కడ సమావేశమయ్యానో డీజీపీ చెప్పాలి. తెలంగాణలో మావోయిస్టులే లేరన్న డీజీపీ ఎక్కడ సమావేశమయ్యారో చెప్పాలి. నాపై నమోదైన కేసుపై పౌరసమాజం స్పందించిన తీరు సంతృప్తినిచ్చింది. ఐఏఎస్‌ స్థాయి అధికారులు కూడా నాపై పెట్టిన కేసును వ్యతిరేకిస్తున్నారు. ఇది పోలీసుల అత్యుత్సాహం కావొచ్చు’ అని హరగోపాల్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు ప్రొఫెసర్‌ హరగోపాల్‌పై ఉపా కింద కేసు పెట్టడంపై ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు భగ్గుమంటున్నాయి.

కాగా 2002 ఆగస్టు 19న ములుగు జిల్లా తాడ్వాయి పీఎస్ లో చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం యూఏపీఏ కింద హరగోపాల్‌ పై కేసు నమోదు చేశారు. యూఏపీఏ, ఆర్మ్స్ యాక్ట్ తో పాటు 10 సెక్షన్ల కింద హరగోపాల్ తో పాటు 152 మందిపై కేసు నమోదు చేశారు పోలీసులు. అలాగే మావోయిస్టు పుస్తకాల్లో హరగోపాల్‌ పేరుందని, ప్రజా ప్రతినిధులపై దాడికి కుట్ర చేశారని పోలీసులు ఆరోపిస్తున్నారు.

 

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..