నాలుగోవ విడత పార్లమెంట్ ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుకుంది. నేటితో ప్రధాని మోదీ తెలంగాణలో ఎన్నికల ప్రచారం ముగియనుంది. అభివృద్ధి, భద్రత, ప్రపంచవ్యాప్తంగా.. భారత ప్రతిష్ఠ పెంచడమే లక్ష్యంగా ప్రధాని మోదీ ప్రచారం సాగుతోంది. ఐదేళ్లలో 3 కోట్ల ఇళ్లు కట్టించడం, 70ఏళ్లు పైబడిన వారికి ఉచిత చికిత్స అందించడం మోదీ లక్ష్యమన్నారు. మోదీ గ్యారంటీ అంటే ఖచ్చితంగా అమలు అవుతుందని తెలిపారు ప్రధాని మోదీ.
రాజకీయ ప్రత్యర్థులపై మోదీ నిప్పులే మనం ఇప్పటిదాకా చూశాం. కానీ మహబూబ్‌నగర్‌లో మోదీలో ఉన్న మరో కోణం ఆవిష్కృతమైంది. మహబూబ్ నగర్ నియోజకవర్గం పరిధిలో జరిగిన సభలో పాల్గొన్న మోదీ.. మరోసారి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. మోదీ ప్రసంగిస్తుండగా, ఒక్కసారిగా ఆయన చూపు సభకు హాజరైన దివ్యాంగులపై పడింది. వెంటనే స్పందించని మోదీ, వారిని జనం మధ్యలో నుంచి సురక్షిత ప్రాంతానికి తీసుకు రమ్మని సూచించారు. దీంతో ఆ ఇద్దరు దివ్యాంగు మహిళలను వాలంటీర్లు సభ ప్రాంగణంలో తీసుకువచ్చారు. ఈ సందర్భంగా తనపై ప్రేమతో వ్యయప్రయాసలకు ఒడ్చి బహిరంగ సభకు హాజరైనందుకు ఆ దివ్యాంగులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు ప్రధాని మోదీ.
ప్రచార సభల్లో ప్రత్యర్ధులపై నిప్పులు చెరిగే ప్రధాని మోదీలో మరో కోణం ఆవిష్కృతమైంది. నారాయణపేట సభలో దివ్యాంగులపై మోదీ చూపించిన ఔదార్యం సభకే హైలైట్ అయ్యింది…
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…