
భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ముచ్చింతల్ లోని శ్రీ రామానుజ సమాతమూర్తి స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించుకున్నారు. ప్రముఖ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా ఖ్యాతి గడించిన హైదరాబాద్ లోని ముచ్చింతల్ సమతా మూర్తి స్ఫూర్తి వద్ద శ్రీశ్రీశ్రీ రామానుజ చిన్న జీయర్ స్వామి రాష్ట్రపతికి సాంప్రదాయ పద్ధతిలోస్వాగతం పలికారు. ఆధ్యాత్మిక శోభన సంతరించుకున్న సమతా మూర్తి స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించి భారత రాష్ట్రపతి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.
భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ప్రత్యేక హెలికాప్టర్లో సాయంత్రం 5 గంటలకు ముచింతల్ లోని శ్రీరామ నగరంలోని సమతా మూర్తి స్ఫూర్తి కేంద్రానికి చేరుకున్నారు. హెలిపాడ్ నుంచి నేరుగా ప్రత్యేక వాహనంలో సమతా మూర్తి స్ఫూర్తి కేంద్రానికి చేరుకున్నారు. అక్కడ శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి వారు భారత రాష్ట్రపతి ద్రౌపతి మూర్ముకు స్వాగతం పలికారు. గిరిజన సంస్కృతి సంప్రదాయ పద్ధతిలో నృత్య కళాకారులు స్వాగతం తెలిపారు. అనంతరం శ్రీ శ్రీ శ్రీ చిన్న జీయర్ స్వామి రాష్ట్రపతిని వెంట తీసుకుని 108 దివ్యసాలు సందర్శిస్తూ ఆలయ విశేషాలు తెలియ చేశారు.
108 దివ్య దేశాల దర్శనం తర్వాత 216 రామానుజ స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ చూసి అక్కడనుండి రామానుజన్ స్వర్ణ విగ్రహాన్ని దర్శనం చేసుకున్నారు. అక్కడే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ రామానుజ స్వామి వారు మంగళ శాసనాలు ఇచ్చారు ….ప్రత్యేక పూజ కార్యక్రమం నిర్వహించారు. మంగళ శాసనాలతో పాటు శ్రీ రామానుజ వారి ప్రత్యేక మెమొంటోను అందజేశారు. అనంతరం శ్రీ రామానుజ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఎదురుగా ఏర్పాటుచేసిన డైనమిక్ ఫౌంటైన్ స్పెషల్ షో తిలకించారు.
Reporter :Anil
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..