తెలంగాణ దశాబ్ధి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. వివిధ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ ఈ వేడుకల్లో భాగస్వాములవుతన్నారు. అలాగే ప్రధాని మోడీతో సహా పలువురు కేంద్రమంత్రులు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈక్రమంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్ర ప్రజలకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ‘రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలకు నా శుభాకాంక్షలు. అడవులు, వన్యప్రాణులతో సమృద్ధిగా ఉన్న తెలంగాణ గొప్ప సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక. అలాగే ఎందరో ప్రతిభావంతులైన వ్యక్తులు ఈ రాష్ట్రంలోనే పుట్టారు. తెలంగాణ అభివృద్ధి, అలాగే శ్రేయస్సు ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’ అని తెలిపారు ద్రౌపది ముర్ము. అలాగే ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్ తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ‘తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. గొప్ప వారసత్వం, సంస్కృతికి ఈ రాష్ట్రం ప్రతీక. అలాగే అభివృద్ధి చెందుతున్న పరిశ్రమలకు ప్రసిద్ధి చెందింది. కొన్నేళ్లుగా తెలంగాణ ప్రజలు వివిధ రంగాల్లో రాణిస్తూ భారత్ ఎదుగుదలకు ఎంతో దోహదపడుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఇలాగే అభివృద్ధి చెందుతూ, మరిన్ని అత్యుత్తమ శిఖరాలను అధిరోహించాలి’ ట్వీట్ చేశారు ఉపరాష్ట్రపతి.
ఇక లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ‘తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలి. తెలంగాణ ప్రజలు మరిన్ని విజయాలు అందుకోవాలని కోరుకుంటున్నా’ అని ట్వీట్ చేశారు స్పీకర్ ఓం బిర్లా. ఇక కేంద్రమంత్రి గోల్కోండ కోటలో జాతీయ పతాకాన్ని ఎగరవేసి తెలంగాణ దశాబ్ధి ఉత్సవాలను ప్రారంభించారు. ప్రత్యేక తెలంగాణ సాధనలో బీజేపీ తెలంగాణ గుండెచప్పుడయ్యిందన్నారు. సుష్మ స్వరాజ్ తెలంగాణ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు.
My greetings to the people of Telangana on Statehood Day! Endowed with forests and wildlife, Telangana is also uniquely blessed with a rich cultural heritage and talented people. This beautiful state is emerging as a hub of innovation and entrepreneurship. My best wishes for the…
— President of India (@rashtrapatibhvn) June 2, 2023
Warm greetings on the statehood day of Telangana! The state is renowned for its rich heritage, vibrant culture and thriving industries. Over the years, people from Telangana have excelled in various fields and contributed immensely to the growth of Bharat. May the state continue…
— Vice President of India (@VPIndia) June 2, 2023
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..