Telangana: ఎమ్మెల్యే కాలనీలోని ప్రాథమిక పాఠశాలలో పాము కలకలం.. పరుగులు పెట్టిన విద్యార్థులు, సిబ్బంది

|

Sep 02, 2022 | 3:56 PM

ప్రాథమిక స్కూల్‌ ఆవరణలో పాము హల్‌చల్‌ చేసింది. పట్టణంలోని ఎమ్మెల్యే కాలనీ లోగల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో కిటికీ పైన పాము

Telangana: ఎమ్మెల్యే కాలనీలోని ప్రాథమిక పాఠశాలలో పాము కలకలం.. పరుగులు పెట్టిన విద్యార్థులు, సిబ్బంది
Snake
Follow us on

Telangana: పాములంటే ప్రతి ఒక్కరికి చెప్పలేనంత భయం. పాము పేరు ఎత్తగానే భయంతో వణికిపోతుంటారు. పాము పేరు ఎత్తడానికి కూడా కొంత మంది ఇష్టపడరు. ఒక వేళ పాము కనిపిస్తే.. అక్కడి దారిదాపుల్లోకి వెళ్లి జనావాసాల్లోకి వస్తాయి. ఈ క్రమంలో అవి ప్రజల్ని కాటువేయటం, కొన్నికొన్ని సందర్భాల్లో అదిప్రాణాంతకంగా మారటంతో పలువురు పాముకాటు బలవుతుంటారు. కొన్ని సార్లు.. వాటిని మనుషేలే చంపేస్తుంటారు. ఇక తాజగా మంచిర్యాల జిల్లా చెన్నూర్‌లో పాము హల్‌చల్‌ చేసింది. చెన్నూరు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పాము ప్రత్యక్షమైంది.

ప్రాథమిక స్కూల్‌ ఆవరణలో పాము హల్‌చల్‌ చేసింది. పట్టణంలోని ఎమ్మెల్యే కాలనీ లోగల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో కిటికీ పైన పాము కనబడడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు భయభ్రాంతులకు గురై బయటకు పరుగులు పెట్టారు. కొద్ది సేపటికి పాము అక్కడి నుంచి వెళ్లిపోవడంతో అంత ఊపిరి పీల్చుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి