Telangana: తెలంగాణలో ఎన్నికల వాతావరణం.. ఏకంగా అభ్యర్థులనే ప్రకటిస్తున్న బీఆర్ఎస్‌..

|

May 06, 2023 | 7:21 AM

తెలంగాణ రాజకీయాలు ఎన్నికలకు ముందే హీటెక్కుతున్నాయి. అన్ని పార్టీలు ఎన్నికల రంగంలోకి దిగాయి. ఇక.. అభ్యర్థుల విషయంలో ఒకడుగు ముందుకేసిన బీఆర్ఎస్.. ఇటీవల ఎమ్మెల్యే టికెట్లు విషయంలో క్లారిటీ ఇస్తూ వస్తోంది. ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల విషయంలో కేసీఆర్‌తోపాటు మంత్రి కేటీఆర్ కూడా ఫోకస్‌ పెంచారు. పలు చోట్ల ఏకంగా క్యాండేట్లను ప్రకటించేస్తున్నారు.

Telangana: తెలంగాణలో ఎన్నికల వాతావరణం.. ఏకంగా అభ్యర్థులనే ప్రకటిస్తున్న బీఆర్ఎస్‌..
Minister KTR
Follow us on

తెలంగాణ రాజకీయాలు ఎన్నికలకు ముందే హీటెక్కుతున్నాయి. అన్ని పార్టీలు ఎన్నికల రంగంలోకి దిగాయి. ఇక.. అభ్యర్థుల విషయంలో ఒకడుగు ముందుకేసిన బీఆర్ఎస్.. ఇటీవల ఎమ్మెల్యే టికెట్లు విషయంలో క్లారిటీ ఇస్తూ వస్తోంది. ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల విషయంలో కేసీఆర్‌తోపాటు మంత్రి కేటీఆర్ కూడా ఫోకస్‌ పెంచారు. పలు చోట్ల ఏకంగా క్యాండేట్లను ప్రకటించేస్తున్నారు. మొన్నామధ్య హుజురాబాద్‌ ఎమ్మెల్యే అభ్యర్థిగా కౌశిక్‌రెడ్డిని ప్రకటించి.. అక్కడ సస్పెన్స్‌కు తెరదించారు. తాజాగా.. మరో ఇద్దరు అభ్యర్థులను డిక్లేర్‌ చేశారు మంత్రి కేటీఆర్‌. హుస్నాబాద్‌లో పర్యటించిన కేటీఆర్‌.. ఎమ్మెల్యే అభ్యర్థిగా వీ.సతీష్‌ను ప్రకటించారు.

ఇక.. హుస్నాబాద్‌ సభలోనే మరో స్పష్టత ఇచ్చారు మంత్రి కేటీఆర్‌. కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా వినోద్‌కుమార్‌ పోటీ చేస్తారని చెప్పారు. మంచి మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మరోవైపు… ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో పర్యటించిన మంత్రి కేటీఆర్‌.. వరంగల్ పశ్చిమలో జరుగుతున్న రాజకీయ ప్రచారాలకు తెరదించారు. వచ్చే ఎన్నికల్లో వరంగల్‌ పశ్చిమ నియోజకవర్గం నుండి పోటీ చేసేది దాస్యం వినయ్ భాస్కరేనని క్లారిటీ ఇచ్చారు. ఈసారి రికార్డుస్థాయి మెజారిటీతో గెలిపించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు మంత్రి కేటీఆర్‌.

మొత్తంగా..బండి సంజయ్‌పై బీఆర్ఎస్‌ నుంచి ఎవరు పోటీ చేస్తారనేదానిపై కొన్నిరోజులుగా సందిగ్ధత నెలకొంది. అంతేకాదు.. వినోద్ ఎమ్మెల్యేగా పోటీచేస్తారని కూడా వార్తలు వచ్చాయి. అయితే.. కేటీఆర్ తాజా ప్రకటనతో ఫుల్ క్లారిటీ వచ్చేసింది. అటు.. హుస్నాబాద్‌తోపాటు వరంగల్‌ పశ్చిమ సీటుపై స్పష్టత ఇచ్చేశారు కేటీఆర్‌. రాబోయే రోజుల్లో ఎన్నికలకు ముందే.. కేటీఆర్‌.. ఇంకెవరెవరిని ప్రకటిస్తారో చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..