Mahabubnagar: పాలమూరులో యాత్రల జోరు.. అన్ని పార్టీల్లో అదే ఊపు.. అప్పుడే ఎన్నికలు వచ్చేశాయా..?

| Edited By: Balaraju Goud

Feb 15, 2024 | 8:08 PM

పాలమూరులో రాజకీయ నాయకుల యాత్రల జోరు కొనసాగుతోంది. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రధాన పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. షెడ్యూల్ కంటే ముందే విజయావకాశాలు మెరుగుపరుచుకునేందుకు పార్టీలు ముందస్తు ప్రచారాలు మొదలుపెట్టేశాయి. ముఖ్యంగా యాత్రల పేరుతో పొలిటికల్ హీట్ పెంచుతూ ఎన్నికల వాతావరణాన్ని ప్రతిబింబిస్తున్నారు పార్టీ నేతలు.

Mahabubnagar: పాలమూరులో యాత్రల జోరు.. అన్ని పార్టీల్లో అదే ఊపు.. అప్పుడే ఎన్నికలు వచ్చేశాయా..?
Mahabubnagar Politics
Follow us on

పాలమూరులో రాజకీయ నాయకుల యాత్రల జోరు కొనసాగుతోంది. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రధాన పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. షెడ్యూల్ కంటే ముందే విజయావకాశాలు మెరుగుపరుచుకునేందుకు పార్టీలు ముందస్తు ప్రచారాలు మొదలుపెట్టేశాయి. ముఖ్యంగా యాత్రల పేరుతో పొలిటికల్ హీట్ పెంచుతూ ఎన్నికల వాతావరణాన్ని ప్రతిబింబిస్తున్నారు పార్టీ నేతలు. ఉమ్మడి జిల్లాలో ఎంపీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలు ప్రచార ముందస్తు ప్రణాళికల్లో నిమగ్నమయ్యాయి. ఎన్నికల షెడ్యూల్ రాకముందే యాత్రల పేరుతో ప్రచారానికి సిద్ధమయ్యారు నేతలు. వచ్చే ఎన్నికలకు అటూ ప్రజల్లోకి వెళ్లడం, పార్టీ క్యాడర్ ను సన్నధం చేసేలా ప్లాన్ లు చేస్తున్నాయి పార్టీలు.

మొదట కాంగ్రెస్…తర్వాత బీజేపీ..

అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన ఊపులో జిల్లాలో యాత్రల ప్రచారానికి మొదట కాంగ్రెస్ పార్టీ నేతలు అంకురార్పన చేశారు. మహబూబ్ నగర్ పార్లమెంట్ టికెట్ ఆశిస్తున్న సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు చల్లా వంశీచంద్ రెడ్డి ఇప్పటికే పాలమూరు న్యాయ్ యాత్ర పేరుతో నియోజకవర్గం మొత్తం చూట్టేసేలా ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. హస్తం శ్రేణులను సమాయత్తం చేయడంతో పాటు.. పార్లమెంట్ పరిధిలో ప్రజల్లోకి వెళ్లేలా ఆయన యాత్ర నడుస్తోంది.

విజయ సంకల్ప యాత్ర పేరుతో బీజేపీ..

ఇక తెలంగాణలోని వీలైనన్నీ ఎక్కువ సీట్లు సాధించాలని పట్టున్న స్థానాలపై భారతీయ జనతా పార్టీ ఫోకస్ పెట్టింది. పాలమూరు జిల్లాలోని మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ రెండు స్థానాలు ఖచ్చితంగా కమలంకు దక్కే అవకాశముందని నేతలు భావిస్తున్నారు. ఇప్పటికే ఈ రెండు పార్లమెంట్ నియోజకవర్గాల్లో బీజేపీ శ్రేణులు ఉత్సాహంగా పనిచేస్తున్నాయి. అయితే ఎన్నికల షెడ్యూల్ కంటే ముందే ముఖ్య నేతలు యాత్ర చేస్తే విజయావకాశాలు మరింత మెరుగయ్యే అవకాశం ఉంటుందని యోచిస్తున్నారట పార్టీ క్యాడర్. నారాయణపేట జిల్లా మక్తాల నియోజకవర్గంలోని కృష్ణ నుంచి ఈ యాత్ర ప్రారంభించాలని బీజేపీ నేతలు నిర్ణయం తీసుకున్నారు. ఫిబ్రవరి 20వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్రకు విజయ సంకల్ప యాత్ర గా నామకరణం చేశారు. మొత్తం మూడు పార్లమెంట్ సెగ్మెంట్ల మీదుగా 11రోజుల పాటు యాత్ర కొనసాగనున్నట్లు తెలిపారు. ప్రతి రోజు రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో యాత్ర పూర్తయ్యేలా ప్లాన్ చేశారు. అన్ని వర్గాల ప్రజలతో మమేకమవుతూ యాత్ర కొనసాగుతుందని బీజేపీ నేతలు చెబుతున్నారు.

ఏది ఎమైనా ఉమ్మడి పాలమూరులో నేతల యాత్రలు పార్లమెంట్ ఎన్నికల వాతావరణాన్ని తెచ్చాశాయని ప్రజలు మాట్లాడుకుంటున్నారు. షెడ్యూల్ కంటే ముందే పరిస్థితి ఇలా ఉంటే అనంతరం ప్రచార హోరు భారీస్థాయిలో ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…