Telangana: పూనకాలు లోడింగ్.. తెలంగాణలో రక్తి కట్టిస్తున్న పార్టీల నయా స్ట్రాటజీ..!

|

Feb 15, 2023 | 8:37 PM

తెలంగాణ రాజకీయం హిందుత్వం చుట్టూ తిరుగుతోందా? ఉన్నట్టుండి అన్ని పార్టీలు జై శ్రీరామ్‌ నినాదం ఎందుకు ఎత్తుకుంటున్నాయి.? ఈ విషయంలో ఎవరి వ్యూహం ఏంటి..?

Telangana: పూనకాలు లోడింగ్.. తెలంగాణలో రక్తి కట్టిస్తున్న పార్టీల నయా స్ట్రాటజీ..!
Bjp Vs Brs Vs Congress
Follow us on

తెలంగాణ రాజకీయం హిందుత్వం చుట్టూ తిరుగుతోందా? ఉన్నట్టుండి అన్ని పార్టీలు జై శ్రీరామ్‌ నినాదం ఎందుకు ఎత్తుకుంటున్నాయి.? ఈ విషయంలో ఎవరి వ్యూహం ఏంటి..? ఆసక్తికర వివరాలు మీకోసం.. తెలంగాణలో ఎన్నికల మూడ్ వచ్చేసినట్లే కనిపిస్తోంది. టైమ్‌ దగ్గరపడుతున్న కొద్దీ ప్రధాన పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి.! హిందుత్వ ఎజెండాను వేగంగా ట్రాక్‌పైకి ఎక్కిస్తున్నాయి. హాథ్‌ సే హాథ్‌ జోడో యాత్రలో ఉన్న రేవంత్‌ రెడ్డి భద్రాచలం శ్రీరాముడి ఆలయం సాక్షిగా కీలక కామెంట్స్ చేశారు. అధికారంలోకి వస్తే వంద అసెంబ్లీ నియోజకవర్గాల్లో వెయ్యి కోట్లతో రాముడి ఆలయాలు కట్టిస్తామన్నారు.

బీజేపీని ఎదుర్కొనేందుకే కాంగ్రెస్‌ హిందూత్వ అజెండాను తెరపైకి తెస్తోందనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఈ ఇష్యూలో బీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్య వార్‌ జరుగుతోంది. హిందుత్వం పేటెంట్‌గా దూసుకెళ్తున్నారు కమలనాథులు.. అటు సీఎం కేసీఆర్ కూడా ఆలయాల అభివృద్ధిపై ఫోకస్ చేస్తున్నారు. ఇప్పటికే యాదాద్రిని పూర్తిచేశారు. ఇప్పుడు కొండగట్టుపై దృష్టిపెడుతున్నారు. 600 కోట్లతో దేశంలోనే అతిపెద్ద హనుమాన్‌ క్షేత్రాన్ని నిర్మిస్తామని ప్రకటించారు. బీజేపీ, బీఆర్ఎస్ కి పోటీగా ఇప్పుడు కాంగ్రెస్‌ కూడా హిందుత్వ నినాదం ఎత్తుకుంటోంది. నియోజకవర్గానికి ఓ రాముడి గుడి అనే కాన్సెప్ట్‌ అందులో భాగమే అంటున్నారు..

హిందుత్వ విషయంలో బీజేపీ వ్యూహం వెరీ క్లియర్. జైశ్రీరామ్‌ నినాదం విషయంలో వెనక్కితగ్గేది లేదని ఇప్పటికే స్పష్టం చేసింది..
మెజార్టీనే తమ ఓటు బ్యాంకుగా మల్చుకొని ఆధిపత్యం చేలాయించాలని చూస్తోంది! అందుకే ఆలయాల అభివృద్ధితో గట్టిగా కౌంటర్ ఇస్తోంది బీఆర్ఎస్. ఇప్పుడు కాంగ్రెస్‌ కూడా ఇదే బాటలోకి వస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..