Yellandu: ఇల్లందులో పొలిటికల్ హైటెన్షన్.. షెడ్డు కూల్చివేతపై ఉద్రిక్తత
వారం రోజుల క్రితమే అటవీ, రెవెన్యూ అధికారులు ఈ ప్రాంతాలను పరిశీలించి నోటీసులు అందజేశారు. మంగళవారమే జెసిబి వాహనంతో అటవీ, రెవెన్యూ అధికారులు సిబ్బంది పోలీసులు రాగా విషయం తెలుకున్న కౌన్సిలర్ కుటుంబ సభ్యులు, భారాస కౌన్సి లర్లు, హరిసింగ్ నాయక్ (మాజీ ఎమ్మెల్యే హరిప్రియ భర్త) అక్కడకు చేరుకొని అటవీశాఖ అధికారులతో..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం లోని సీఎస్పీ బస్తీ రాజీవ్ నగర్ లో ఇల్లందు మునిసిపాలిటీ 21వ వార్డు కౌన్సి లర్ కొండపల్లి సరిత కుటుంబ సభ్యుల కోళ్ల ఫారాన్ని అటవీ అధికారులు ఈరోజు తెల్లవారుజామున కూల్చివేశారు. నిబంధనలకు విరుద్ధంగా అటవీ శాఖ స్థలంలో షెడ్డు నిర్మించారంటూ అటవీ శాఖ ఆధ్వర్యంలో సిబ్బంది జేసీబీ వాహనాన్ని తీసుకువచ్చి తొలగించారు. వారం రోజుల క్రితమే అటవీ, రెవెన్యూ అధికారులు ఈ ప్రాంతాలను పరిశీలించి నోటీసులు అందజేశారు. మంగళవారమే జెసిబి వాహనంతో అటవీ, రెవెన్యూ అధికారులు సిబ్బంది పోలీసులు రాగా విషయం తెలుకున్న కౌన్సిలర్ కుటుంబ సభ్యులు, భారాస కౌన్సి లర్లు, హరిసింగ్ నాయక్ (మాజీ ఎమ్మెల్యే హరిప్రియ భర్త) అక్కడకు చేరుకొని అటవీశాఖ అధికారులతో వాగ్వాదానికి దిగారు. స్థలం రెవెన్యూ పరిధిలో ఉందని, గతంలోనే పట్టాలిచ్చారని, అధికార పార్టీ నేతల ప్రోద్బలంతో దాడులకు పాల్పడాలనుకో వడం సరికాదన్నారు.
చుట్టుపక్కల ఉన్న రైతులు ఘటనా స్థలికి వచ్చి తాము తాతముత్తా తల కాలం నుంచి ఇక్కడే ఉన్నామని అధికారులు కుట్రపూరితంగా వ్యవహరి స్తున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో అటవీ, రెవెన్యూ ఆధ్వర్యంలో వారం రోజుల్లో జాయింట్ సర్వే చేసి తమ శాఖ పరిధిలో ఉంటే స్వాధీనపరచుకొని చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని చెప్పిన 24 గంటల పరిధిలోనే పోలీస్ శాఖ రక్షణ తీసుకొని ఈరోజు తెల్లవారుజామున 5 గంటలకే అటవీశాఖ అధికారులు జెసిబి తో తొలగింపు చేపట్టారు.
కొన్ని రోజులుగా మున్సిపల్ పాలకవర్గంలో జరుగుతున్న విభేదాల నేపథ్యం మునిసిపల్ చైర్మన్ డివి పై అవిశ్వాసానికి యత్నించిన 15 మంది కౌన్సిలర్లలో ఒకరిగా ఉన్న సరిత కుటుంబ సభ్యుల స్థలాలపై రాజకీయ కుట్రతోనే దాడులు చేస్తున్నారన్న ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




