Kukatpally Murder: కూకట్‌పల్లి సహస్ర మర్డర్‌ కేసులో కీలక మలుపు.. పోలీసుల అదుపులో యువకుడు!

హైదరాబాద్‌లో తీవ్ర కలకలం రేపిన కూకట్‌పల్లి బాలిక సహస్ర మర్డర్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో అనుమానితుడు సంజయ్‌ను పోలీసుల అదుపులో అదుపులోకి తీసుకున్నారు. ఘటనా స్థలంలో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాల ఆధారంగా ప్రస్తుతం పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

Kukatpally Murder: కూకట్‌పల్లి సహస్ర మర్డర్‌ కేసులో కీలక మలుపు.. పోలీసుల అదుపులో యువకుడు!
Crime News

Updated on: Aug 19, 2025 | 9:14 AM

హైదరాబాద్‌లో తీవ్ర కలకలం రేపిన కూకట్‌పల్లి బాలిక హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో అనుమానితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సంజయ్‌ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటనా స్థలంలో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాల ఆధారంగా సంజయ్‌పై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సంజయ్‌ సహస్ర ఉంటున్న ఇంట్లోనే అద్దెకు ఉంటున్నట్టు తెలుస్తోంది.

బాలిక హత్య జరిగిన తర్వాత సంజయ్‌ ఘటనా ప్రాంతంలోనే తరచూ అనుమానంతా తిరుగుతున్నట్టు స్థానికంగా ఉన్న సీసీ కెమెరా దృశ్యాల ద్వారా పోలీసులు గుర్తించినట్టు తెలుస్తోంది.దీంతో సంజయ్‌పై అనుమానం వచ్చిన పోలీసులు ప్రస్తుతం అతడిని అదుపులోకి తీసుకొని ఘటనపై విచారిస్తున్నారు.

కాగా సోమవారం కూకట్‌పల్లిలో సంగీత్‌నగర్‌లో ఈ దారుణ హత్య వెలుగు చూసింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒంటరిగా ఉన్న బాలికపై కన్నేసిన దుండగుడు.. ఇంట్లో చొరబడి బాలికపై లైంగిక దాడికి పాల్పడేందుకు ప్రయత్నించి ఉంటాడని.. తప్పించుకోవడానికి ప్రయత్నించిన బాలిక ప్రతిఘటించడంతోనే నిందితుడు ఈ దారుణానికి పాల్పడి ఉంటారని పోలీసులు ప్రాథమికంగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.