Telangana: పోలీసులకు ఫిర్యాదు చేసిన చెరుకు సుహాస్.. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై కేసు నమోదు..

కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వర్సెస్‌ చెరుకు సుధాకర్‌గౌడ్‌ గొడవ మరో మలుపు తిరిగింది. కోమటిరెడ్డి బెదిరింపులపై పోలీసులను ఆశ్రయించారు చెరుకు సుధాకర్‌ కొడుకు సుహాస్‌.

Telangana: పోలీసులకు ఫిర్యాదు చేసిన చెరుకు సుహాస్.. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై కేసు నమోదు..
Mp Komatireddy

Updated on: Mar 07, 2023 | 1:34 PM

కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వర్సెస్‌ చెరుకు సుధాకర్‌గౌడ్‌ గొడవ మరో మలుపు తిరిగింది. కోమటిరెడ్డి బెదిరింపులపై పోలీసులను ఆశ్రయించారు చెరుకు సుధాకర్‌ కొడుకు సుహాస్‌. తనను చంపేస్తానని బెదిరించారంటూ కంప్లైంట్‌ చేశారు. దాంతో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై కేసు నమోదు చేశారు నల్గొండ వన్‌టౌన్‌ పోలీసులు. ఎఫ్‌ఐఆర్‌లో ఐపీసీ 506 సెక్షన్‌ పెట్టారు. ఈ ఫిర్యాదుకు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బెదిరింపులకు సంబంధించిన ఆడియో రికార్డ్‌ను కూడా జత చేశారు.

నల్గొండ కాంగ్రెస్ నేత చెరుకు సుధాకర్ తనయుడు చెరుకు సుహాస్‌కు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఫోన్ చేసి బెదిరించిన విషయం తెలిసిందే. వారిని చంపేందుకు వంద కార్లలో మనుషులు తిరుగుతున్నారంటూ వార్నింగ్ కూడా ఇచ్చారు కోమటిరెడ్డి. ఇందుకు సంబంధించిన ఆడియో రికార్డ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. టి.కాంగ్రెస్‌లో పెనుదుమారం రేపుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..