Telangana: ఆటో కిరాయి కోసం గొడవ.. పోలీస్ కానిస్టేబుల్ అరెస్ట్.. ఎక్కడ జరిగిందంటే..
Telangana: ఆటో కిరాయి కోసం జరిగిన ఘర్షణలో ఓ పోలీస్ కానిస్టేబుల్ అరెస్ట్ అయ్యాడు. తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా యాదాద్రి పట్టణంలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన..
Telangana: ఆటో కిరాయి కోసం జరిగిన ఘర్షణలో ఓ పోలీస్ కానిస్టేబుల్ అరెస్ట్ అయ్యాడు. తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా యాదాద్రి పట్టణంలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆటో కిరాయి కోసం ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆ గొడవ కాస్తా దాడి వరకు వెళ్లింది. చివరికి అరెస్ట్‌కు దారితీసింది. యాదాద్రి క్షేత్రానికి వచ్చే భక్తులను కొండమీదకు తరలించేందుకు అక్కడ కొన్ని ఆటోలు అందుబాటులో ఉంటాయి. గాంధీ నగర్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ నాగరాజు.. అక్కడ పాండు అనే వ్యక్తి ఆటో ఎక్కాడు.
ఆటో దిగిన అనంతరం డ్రైవర్, కానిస్టేబుల్ నాగరాజు మధ్య కిరాయి విషయంలో వాగ్వాదం చోటు చేసుకుంది. ఆ గొడవ కాస్తా తవ్రమై పరస్పర దాడి వరకు వెళ్లింది. ఈ క్రమంలో మరింత కోపోద్రిక్తుడైన కానిస్టేబుల్ నాగరాజు.. ఆటో డ్రైవర్ పాండును రాయితో కొట్టాడు. దాంతో పాండు తలకు తీవ్ర గాయమైంది. ఇది గమనించిన స్థానికులు వెంటనే అతన్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న యాదాద్రి టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఆటోడ్రైవర్‌పై దాడి చేసిన నాగరాజుపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ జానకి రెడ్డి తెలిపారు.
Also read:
Dengue: అక్కడ అల్లాడిస్తోన్న డెంగ్యూ.. వేలల్లో నమోదవుతోన్న కేసులు.. ఆస్పత్రులన్నీ ఫుల్
Horoscope Today: ఈరోజు వీరికి ఉద్యోగాల్లో అనుకూలం.. ఆర్థిక సమస్యలు తగ్గుతాయి.. రాశిఫలాలు..