Dengue: అక్కడ అల్లాడిస్తోన్న డెంగ్యూ.. వేలల్లో నమోదవుతోన్న కేసులు.. ఆస్పత్రులన్నీ ఫుల్

ఆస్పత్రులన్నీ డెంగ్యూ బాధితులతో నిండిపోతున్నాయి. మొన్నటిదాకా కరోనాతో కంటిమీద కునుకు లేకుండా గడిపిన జనం నేడు డెంగ్యూతో కకావికలమవుతున్నారు.

Dengue: అక్కడ అల్లాడిస్తోన్న డెంగ్యూ.. వేలల్లో నమోదవుతోన్న కేసులు.. ఆస్పత్రులన్నీ ఫుల్
Dengue
Follow us
Ram Naramaneni

|

Updated on: Sep 13, 2021 | 6:55 AM

ఇంకా కరోనా పీడ తొలగనేలేదు. అప్పుడే డెంగ్యూ దడ మొదలైంది. మధ్యప్రదేశ్‌లో వేల సంఖ్యలో నమోదవుతున్న డెంగ్యూ కేసులు జనాన్ని భయపెడుతున్నాయి. అవును అక్కడ ఇప్పుడు డెంగ్యూ వణికిస్తోంది. జ్వరాలతో జనం అల్లాడుతున్నారు. మధ్యప్రదేశ్‌ వ్యాప్తంగా డెంగ్యూ కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఆస్పత్రులన్నీ డెంగ్యూ బాధితులతో నిండిపోతున్నాయి. మొన్నటిదాకా కరోనాతో కంటిమీద కునుకు లేకుండా గడిపిన జనం నేడు డెంగ్యూతో కకావికలమవుతున్నారు. ఇప్పటివరకూ 2 వేల 400 మంది డెంగ్యూ బారిన పడ్డారు. ఆస్పత్రుల్లో అడ్మిట్‌ అవుతున్న రోగుల్లో 20 శాతం మంది డెంగ్యూ బాధితులే. డెంగ్యూ రోగుల్లో ఎక్కువ మంది దోమకాటుకు గురైన వాళ్లే ఉంటున్నారు. మండ్‌సార్‌ జిల్లాలో దోమకాటుతో 800 మంది డెంగ్యూ బారిన పడ్డారు. ఇటు జబాల్‌పూర్‌ జిల్లాలోనూ డెంగ్యూ కేసులు అధికంగానే నమోదవుతున్నాయి. ఇండోర్‌, అగర్‌మాల్వా, రాట్లం జిల్లాల్లోనూ డెంగ్యూ ప్రకంపనలు సృష్టిస్తోంది. డెంగ్యూ బారిన పడి ఇప్పటివరకూ పదుల సంఖ్యలో జనాలు చనిపోయారు.

మరోవైపు.. డెంగ్యూ కేసుల పెరుగుదలతో అప్రమత్తమైంది మధ్యప్రదేశ్ ప్రభుత్వం. డెంగ్యూ కారకాలైన దోమల నివారణ చర్యల్ని చేపడుతోంది. ఫాగింగ్‌ యంత్రాలతో దోమల ఆవాసాలపై స్ప్రే చేయిస్తోంది. అసలే వర్షాకాలం.. పారిశుద్ధ్య లోపం, డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో డెంగ్యూ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. నీటి గుంతలు దోమల ఆవాసాలుగా మారుతున్నాయి. దీనిపై దృష్టిసారించిన మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్యానికి పెద్దపీట వేస్తోంది. మరోవైపు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోనూ భారీగా డెంగ్యూ కేసులు నమోదవుతున్నాయి. హాస్పిటల్స్ అన్నీ రోగులతో కిక్కిరుస్తున్నాయి.

Also Read: రూ.40 వేలకే కేటీఎం, రూ.35 వేలకే రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌.. ఏంటా అని ఆరా తీయగా పోలీసులు షాక్

దమ్ దమ్ చేస్తానంది.. వారం కూడా ఉండలేకపోయింది.. బిగ్‌బాస్‌ తొలి ఎలిమినేషన్‌ ఆమే..!

బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ లక్ష్యంగా తెంబా మాస్టర్ ప్లాన్..!
టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ లక్ష్యంగా తెంబా మాస్టర్ ప్లాన్..!
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
జస్ప్రీత్ బుమ్రా @ 200.. మెల్‌బోర్న్‌లో డబుల్ సెంచరీ
జస్ప్రీత్ బుమ్రా @ 200.. మెల్‌బోర్న్‌లో డబుల్ సెంచరీ
పిలిభిత్‌లో ఎన్‌కౌంటర్ లో గాయపడిన ముగ్గురు ఖలిస్తానీ ఉగ్రవాదులు
పిలిభిత్‌లో ఎన్‌కౌంటర్ లో గాయపడిన ముగ్గురు ఖలిస్తానీ ఉగ్రవాదులు
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
BBLలో సామ్ కాన్స్టాస్ మెరుపులు..IPL 2025లో ఆ జట్టులోకి..?
BBLలో సామ్ కాన్స్టాస్ మెరుపులు..IPL 2025లో ఆ జట్టులోకి..?
మహా కుంభమేళలో నాల్గవ రాజ స్నానం ఎప్పుడు? శుభ సమయం తెలుసుకోండి
మహా కుంభమేళలో నాల్గవ రాజ స్నానం ఎప్పుడు? శుభ సమయం తెలుసుకోండి
ఫీలింగ్స్ సాంగ్ చేయడానికి చాలా భయపడ్డా.. రష్మిక
ఫీలింగ్స్ సాంగ్ చేయడానికి చాలా భయపడ్డా.. రష్మిక
పంట పొలాల్లో కదులుతూ కనిపించిన భారీ ఆకారం.. ఏంటాని చూడగా..!
పంట పొలాల్లో కదులుతూ కనిపించిన భారీ ఆకారం.. ఏంటాని చూడగా..!