AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chanakya Niti: వ్యాపారంలో సక్సెస్ కావాలంటే ఆచార్య చాణక్యుడు ఈ ఐదు టిప్స్ పాటిస్తే చాలు.. మీరు కోటీశ్వరులే.. ఓ సారి ట్రై చేయండి..

ఆచార్య చాణక్యుడు గొప్ప పండితుడు. అతను దౌత్యం ,రాజకీయాలలో నైపుణ్యం కలిగినవాడు. ఆచార్య చాణక్యుడిని విష్ణు గుప్తుడు, కౌటిల్యుడు అని కూడా పిలుస్తారు. అతను చెప్పిన కొన్ని బిజినెస్ ట్రిక్స్ పాటిస్తే విజయం...

Chanakya Niti: వ్యాపారంలో సక్సెస్ కావాలంటే ఆచార్య చాణక్యుడు ఈ ఐదు టిప్స్ పాటిస్తే చాలు.. మీరు కోటీశ్వరులే.. ఓ సారి ట్రై చేయండి..
Chanakya
Sanjay Kasula
|

Updated on: Sep 13, 2021 | 7:56 AM

Share

ఆర్థిక శాస్త్రము లేదా అర్ధ శాస్త్రము (Economics) ఒక విశిష్ట స్థానాన్ని ఆక్రమించింది. అర్థ శాస్త్ర పరిజ్ఞానం ప్రతి మానవునికి అవసరం. దైనందిక జీవనంలో దీని ప్రాముఖ్యం ఎనలేనిది. ప్రత్యేకంగా అర్థ శాస్త్రము అనే పేరు లేకున్నా మానవ చరిత్ర ప్రారంభమైనప్పటి నుంచే ఈ శాస్త్రం ఆవిర్భవించినదిని చెప్పవచ్చు. దిన దినానికి అభివృద్ధి చెందుతున్న నేటి ప్రపంచంలో ఆర్థిక శాస్త్రం పాత్ర ఎనలేనిది. మానవుల సుఖ సంపద లకు, దేశాల, ప్రభుత్వాల మనుగడకు అవసరమైన ద్రవ్యంను వివరించేదే ఆర్థిక శాస్త్రము. కాని నేటి కాలంలో కేవలం డబ్బు మాత్రమే కాకుండా డబ్బుతోపాటు సంబంధం ఉన్న అన్ని కార్యకలాపాల గురించి అర్థ శాస్త్రము వివరిస్తుంది. ఇందులో చాణక్యుడు చెప్పిన ఏడు సూత్రాలను అమలు చేస్తే విజయం పథంలో దూసుకుపోవచ్చు. ఆచార్య చాణక్యుడు గొప్ప పండితుడు. అతను దౌత్యం ,రాజకీయాలలో నైపుణ్యం కలిగినవాడు. ఆచార్య చాణక్యుడిని విష్ణు గుప్తుడు, కౌటిల్యుడు అని కూడా పిలుస్తారు. ఆచార్య చాణక్యుడు తన దౌత్యంతో చంద్రగుప్త మౌర్యను చక్రవర్తిగా చేశాడు. అతను తన జీవితకాలంలో అనేక గ్రంథాలు రాసాడు. కానీ నేటికీ ప్రజలు ఆయన రాసిన నీతిని చదవడానికి ఇష్టపడుతున్నారు.

నీతిశాస్త్రంలో జీవితానికి సంబంధించిన అన్ని మంచి , చెడు విషయాల గురించి చాణక్య పేర్కొన్నాడు. ఉద్యోగం , వ్యాపార రంగంలో విజయం సాధించాలనుకునే వ్యక్తులు ఆ నాలుగు విషయాలను జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉందని ఆచార్య చాణక్య నీతిశాస్త్రంలో చెప్పారు. ఈ నాలుగు విషయాల గురించి మనం తెలుసుకుందాం.

పని క్రమశిక్షణ..

ఆచార్య చాణక్యుడు ప్రకారం జీవితంలో విజయం సాధించాలనుకునే వ్యక్తి జీవితంలో క్రమశిక్షణ కలిగి ఉండటం చాలా ముఖ్యం. మీ విజయానికి క్రమశిక్షణ మొదటి మెట్టు. దీనిని అనుసరించడం ద్వారా కష్టపడి పనిచేసే స్ఫూర్తి వ్యక్తి జీవితంలో అభివృద్ధి చెందుతుంది. విజేతగా నిలవాలంటే వ్యక్తిలో క్రమశిక్షణ ఉండాలి.

రిస్క్ తీసుకోవడానికి ధైర్యం

ఏ వ్యాపారంలోనైనా విజయం సాధించాలంటే ప్రమాదకర నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం కలిగి ఉండాలని ఆచార్య చాణక్యుడు చెప్పాడు. వైఫల్యాలకు భయపడని వ్యక్తి మాత్రమే విజయం సాధిస్తాడు అని చాణక్యుడు అంటాడు. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం ఉన్న వ్యక్తి ఎల్లప్పుడూ విజయం సాధిస్తాడు.

నైపుణ్యంతో కూడిన ప్రవర్తన

ఆచార్య చాణక్యుడు చెప్పినట్లుగా ఉద్యోగం లేదా వ్యాపారంలో ఒక వ్యక్తి సమర్థవంతమైన ప్రవర్తన కలిగి ఉండటం చాలా ముఖ్యం. చాణక్యుడి మాటల్లో చెప్పాలంటే.. మాటలో మాధుర్యం ఉన్నవారు కఠినమైన వ్యక్తి మనసు కూడా మార్చగలరు. ధనవంతులైన వారు అందరినీ ఆకట్టుకుంటారు. దీని కారణంగా ప్రజలు తమ రంగంలో విజయం సాధిస్తారు. ఇది కాకుండా.. మాటలతో ధనవంతులైన వ్యక్తులు ఎల్లప్పుడూ ప్రజల నుండి గౌరవాన్ని పొందుతారు.

జట్టుగా కృషి స్ఫూర్తి

ఏ వ్యక్తి ఒంటరిగా విజయం సాధించలేడని ఆచార్య చాణక్యుడు చెప్పాడు. అందరిని వెంట తీసుకెళ్లే గుణం ఉన్నవారిలో మాత్రమే విజయం సాధ్యమవుతుంది. విజయం సాధించడానికి చాలా మంది అవసరం. అటువంటి పరిస్థితిలో అందరిని మీతో పాటు తీసుకెళ్లితే జీవితంలో విజయం సాధించడం చాలా సులభం అంటాడు. ఈ సమయంలో మీరు సహనం, సంయమనం పాటించాల్సి ఉంటుందని.. అదే విజయానికి ఓ మెట్టులా మారుతుందని అంటాడు.

ఇవి కూడా చదవండి: PM Narendra Modi: తెనాలికి మరో ఖ్యాతి.. ఐరన్ స్క్రాప్‌తో ప్రధాని మోడీ భారీ విగ్రహం.. సూర్య శిల్పశాలలో..