PM Modi: వరంగల్ ఎన్నికల ప్రచార ర్యాలీలో అనుహ్య ఘటన.. చంటి పిల్లాడిని చూసి ఆగిపోయిన మోదీ

లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని మరింత ఉధృతం చేశారు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఒకేరోజు సుడిగాలి పర్యటన చేశారు. వరంగల్ జిల్లాలో భారీ రోడ్‌షో నిర్వహించారు. వికసిత్‌ భారత్‌ బీజేపీతోనే సాధ్యమన్నారు. మూడోసారి బీజేపీ అధికారం లోకి రాగానే మరిన్ని అభివృద్ది కార్యక్రమాలను ప్రకటిస్తామన్నారు.

PM Modi: వరంగల్ ఎన్నికల ప్రచార ర్యాలీలో అనుహ్య ఘటన.. చంటి పిల్లాడిని చూసి ఆగిపోయిన మోదీ
Modi With Child

Updated on: May 08, 2024 | 5:18 PM

లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని మరింత ఉధృతం చేశారు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఒకేరోజు సుడిగాలి పర్యటన చేశారు. వరంగల్ జిల్లాలో భారీ రోడ్‌షో నిర్వహించారు. వికసిత్‌ భారత్‌ బీజేపీతోనే సాధ్యమన్నారు. మూడోసారి బీజేపీ అధికారం లోకి రాగానే మరిన్ని అభివృద్ది కార్యక్రమాలను ప్రకటిస్తామన్నారు.

అయితే ఎన్నికల కార్యక్రమాలతో బిజీగా గడిపే ప్రధాని నరేంద్ర మోదీ.. ఓ చిన్నారితో కాసేపు సరదాగా గడిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఎన్నికల సభ పూర్తి చేసుకుని రోడ్డు మార్గాన వరంగల్‌ పరిధిలోని మామునూరులో నిర్వహించే బీజేపీ ఎన్నికల ప్రచార సభలో పాల్గొనేందుకు ప్రధాని మోదీ బయలుదేరారు. మార్గమధ్యలో దారికి ఇరువైపు పెద్ద ఎత్తున స్థానిక ప్రజలు నిలబడి ఘన స్వాగతం పలికారు. ఈ క్రమంలో లక్ష్మీపురం గ్రామానికి రాగానే, ఓ తల్లి చంటి పిల్లాడిని ఎత్తుకుని మోదీకి అభివాదం చేస్తూ కనిపించింది.

ఆమెను గమనించిన ప్రధాని మోదీ తన కాన్వాయ్‌ను ఆపి, ఆమె దగ్గరకు వెళ్ళి, పిల్లాడిని తన చేతుల్లోకి తీసుకున్నారు. ఆ పిల్లాడిని ఎత్తుకుని లాలిస్తూ, ఆడుతూ కన్పించారు. ఈ వీడియోను నరేంద్ర మోదీ స్వయంగా తమ ట్విటర్‌ ఎక్స్ ఖాతాలో షేర్‌ చేశారు. ఈ వీడియోను తన వాట్సప్‌ ఛానల్‌లో షేర్‌ చేస్తూ.. ‘‘వరంగల్ లో ప్రచార ర్యాలీకు వెళ్తుండగా లక్ష్మీపురం గ్రామంలో నా యువ మిత్రుడిని కలిశాను..!’’ అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…