Telangana Politics: బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్.. మధ్యలో కాంగ్రెస్.. తెలంగాణ రాజకీయాల్లో కాకరేపుతోన్న ప్రధాని మోదీ వ్యాఖ్యలు..

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇందూరు సభలో చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో కాక రేపాయి. సీఎం కేసీఆర్ ఎన్డీఏలో చేరేందుకు ప్రయత్నించారంటూ మోదీ వ్యాఖ్యానించడంతో.. అంతకుముందు ఏం జరిగింది.. ఇప్పుడు ఏం జరుగుతోంది అనేది మళ్లీ తెరపైకి వచ్చింది. బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయ రాజకీయ వేదికను ఏర్పాటు చేస్తామని ప్రకటించిన కేసీఆర్‌..

Telangana Politics: బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్.. మధ్యలో కాంగ్రెస్.. తెలంగాణ రాజకీయాల్లో కాకరేపుతోన్న ప్రధాని మోదీ వ్యాఖ్యలు..
Bjp - Congress - BRS

Updated on: Oct 04, 2023 | 8:56 AM

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇందూరు సభలో చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో కాక రేపాయి. సీఎం కేసీఆర్ ఎన్డీఏలో చేరేందుకు ప్రయత్నించారంటూ మోదీ వ్యాఖ్యానించడంతో.. అంతకుముందు ఏం జరిగింది.. ఇప్పుడు ఏం జరుగుతోంది అనేది మళ్లీ తెరపైకి వచ్చింది. బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయ రాజకీయ వేదికను ఏర్పాటు చేస్తామని ప్రకటించిన కేసీఆర్‌.. నాడు ప్రధాని మోదీని కలవడం ఇప్పుడు మరోసారి చర్చలోకి వచ్చింది. ఇందూర్‌ జనగర్జన సభలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలతో అంతా 2020 డిసెంబర్‌ 12న అసలేం జరిగిందనే విషయంపై ఆరా తీస్తున్నారు. మూడు రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్‌ కేంద్రమంత్రులను కూడా కలుసుకున్నారు. రాష్ట్రానికి రావాల్సిన బకాయిలను విడుదల చేయాలని కోరారు.

అయితే, నాడు కేసీఆర్‌ తనను ఏం జరిగిందనే విషయాన్ని ప్రధాని స్వయంగా ఇందూర్‌ సభలో చెప్పారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ 48 సీట్లు సాధించిన నేపథ్యంలో కేసీఆర్‌ తనను కలిసి మద్దతు కోరారాని మోదీ గుర్తు చేశారు. ఎన్డీయేలోకి వస్తామన్నారని, అయితే తాను అంగీకరించలేదన్నారు. కేటీఆర్‌ను సీఎం చేసే యోచనలో ఉన్నామని, ఆశీస్సులు అందజేయాలని కేసీఆర్‌ కోరినట్లు ప్రధాని గుర్తు చేశారు. అయితే తాను ఇది రాచరికం కాదని, ప్రజలు కోరుకున్నవారే సీఎం అవుతారని చెప్పానని మోదీ వివరించారు.

పిచ్చి కుక్క కరవలేదు.. కేటీఆర్..

అయితే, ప్రధాని మోదీయే కేసీఆర్‌ను ఢిల్లీకి పిలిచారని అంటున్నారు బీఆర్‌ఎస్‌ నేతలు. సీఎం కావాలంటే తెలంగాణ ప్రజలు మద్దతు ఉంటే చాలని, మోదీ ఆశీస్సులు అవసరం లేదన్నారు. అయినా ఎన్డీయేలో చేరడానికి తమను పిచ్చికుక్క కరవలేదంటూ మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి

బంధం బయటపడింది.. రాహుల్ గాంధీ..

బీజేపీ-బీఆర్‌ఎస్‌ బంధం మరోసారి బయటపడిందని కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు. రెండు పార్టీల దోస్తీ తెలంగాణను నాశనం చేసిందని, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బీజేపీ-బీఆర్‌ఎస్‌ను తిరస్కరిస్తారంటూ సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు.

మొత్తానికి ఇందూరు సభలో మోదీ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాలను కొత్త మలుపు తిప్పనున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..