మునుగోడు ఉప ఎన్నిక వ్యవహారంలో.. వారికి బిగుస్తున్న ఫోన్ ట్యాపింగ్ ఉచ్చు..

సంచలనంగా మారిన ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం ఉమ్మడి నల్లగొండ జిల్లా పోలీసులను వణికిస్తోంది. మునుగోడు బై పోల్ సమయంలో అప్పటి అధికార బీఆర్ఎస్ కు పోలీసులు అనుకూలంగా వ్యవహరించి పెద్ద మొత్తంలో డబ్బును చేరవేసినట్లు సీట్ విచారణలో బయట పడుతోంది. సీట్ దర్యాప్తు.. బీఆర్ఎస్‎కు వంతపాడిన పోలీసు అధికారుల్లో వణుకు పుట్టిస్తోంది. దీంతో మునుగోడు ఉప ఎన్నిక జిల్లా పోలీసుల మెడకు ఉచ్చుగా మారుతోంది. సీట్ విచారణలో వెలుగు చూస్తున్న అక్రమాల మకిలీ జిల్లా పోలీసు యంత్రాంగం మొత్తానికి అంటుకుంటోంది.

మునుగోడు ఉప ఎన్నిక వ్యవహారంలో.. వారికి బిగుస్తున్న ఫోన్ ట్యాపింగ్ ఉచ్చు..
Nalgonda
Follow us

| Edited By: Srikar T

Updated on: Jun 16, 2024 | 11:27 AM

సంచలనంగా మారిన ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం ఉమ్మడి నల్లగొండ జిల్లా పోలీసులను వణికిస్తోంది. మునుగోడు బై పోల్ సమయంలో అప్పటి అధికార బీఆర్ఎస్ కు పోలీసులు అనుకూలంగా వ్యవహరించి పెద్ద మొత్తంలో డబ్బును చేరవేసినట్లు సీట్ విచారణలో బయట పడుతోంది. సీట్ దర్యాప్తు.. బీఆర్ఎస్‎కు వంతపాడిన పోలీసు అధికారుల్లో వణుకు పుట్టిస్తోంది. దీంతో మునుగోడు ఉప ఎన్నిక జిల్లా పోలీసుల మెడకు ఉచ్చుగా మారుతోంది. సీట్ విచారణలో వెలుగు చూస్తున్న అక్రమాల మకిలీ జిల్లా పోలీసు యంత్రాంగం మొత్తానికి అంటుకుంటోంది. రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్న ఫోన్‌ ట్యాపింగ్ వ్యవహారంపై సీట్ దర్యాప్తులో రోజుకో కొత్త అంశం వెలుగులోకి వస్తోంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ అభ్యర్థులకు అనుకూలంగా పోలీస్ పెద్దలు డబ్బులు చేరవేశారని విమర్శలు ఉన్నాయి. ఫోన్ టాపింగ్ కేసులో నిందితులుగా ఉన్న ఐదుగురు అధికారులు గతంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో పనిచేసిన వారే. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు 2015లో నల్లగొండ జిల్లా ఎస్పీగా పనిచేశారు. టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్‌ రావు నల్లగొండలో ఓఎస్డి గా పని చేశారు. ఏఎస్పీలు తిరుపతన్న, భుజంగరావులు కూడా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పలు ప్రాంతాల్లో పనిచేశారు. డిఎస్పి ప్రణీత్ రావు.. ఎస్సైగా జిల్లాలో పలు ప్రాంతాల్లో పనిచేశారు. సీఐ గట్టు మల్లు కూడా నల్గొండ జిల్లాలో పనిచేశారు.

పోలీసుల మెడకు ‘మునుగోడు ఉపఎన్నిక’ ఉచ్చు..

ఫోన్ ట్యాపింగ్‎పై సీట్ చేపట్టిన విచారణలో అనేక విస్తుపోయే అంశాలు వెలుగు చూస్తున్నాయి. అప్పటి అధికార బీఆర్ఎస్‎తో అంటకాగినందుకు జిల్లాలో పనిచేసిన పోలీస్ అధికారుల మెడకు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఉచ్చు బిగిస్తోంది. ఉన్నతాధికారుల ఓరల్ ఆదేశాలతో అప్పటి అధికార బీఆర్ఎస్‎కు రాత్రి వేళల్లో పోలీసులు పెద్ద మొత్తంలో డబ్బును చేరవేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మునుగోడు బై పోల్‎లో డబ్బు చేరవేసిన వ్యవహారం బయటపడటంతో అధికారులను చిక్కుల్లో పడేసింది. స్పెషల్ బ్రాంచ్ వ్యవహారాలను పర్యవేక్షించిన డీఎస్పీ ఆదేశాలతోనే తాను డబ్బులు చేరవేసిన వాహనానికి ఎస్కార్ట్ వ్యవహరించిన ఓ కానిస్టేబుల్ వాంగ్మూలం ఇవ్వడం అధికారుల్లో వణుకు పుట్టిస్తోంది.

టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్స్‎ను విచారించిన సిట్..

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నిందితులుగా ఉన్న పోలీస్ అధికారులు అందరూ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పనిచేశారు. దీంతో ఫోన్ ట్యాపింగ్‎పై దర్యాప్తు చేస్తున్న సిట్.. రెండు నెలల కిందటే జిల్లా కేంద్రంలోని టాస్క్ ఫోర్స్‎లో పనిచేస్తున్న ముగ్గురు పోలీసులను విచారించింది. ఇందులో ఒకరి వాంగ్మూలం ఆధారంగా మునుగోడు బైపోల్‎లో ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఎవరి డబ్బును పట్టుకున్నారు? ఎవరిని బెదిరించి వసూళ్లకు పాల్పడ్డారు? అనే అంశాలపై విచారణ చేపట్టింది. అయితే కానిస్టేబుల్ వాంగ్మూలం పోలీస్ అధికారుల మెడకు చుట్టుకుంటోంది.

డబ్బు తరలించిన వాహనంపై సీట్ ఆరా?

మునుగోడు ఉపఎన్నికల సమయంలో డబ్బును చేరవేసిన వాహనం ఎవరిదన్న కోణంలోనూ స్పెషల్ ఇన్వేస్టిగేషన్ టీం (సిట్) విచారణ జరుపుతోంది. టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా డబ్బు చేరవేత అంశాన్ని లోతుగా దర్యాప్తు చేస్తోంది. డబ్బు తరలింపుకు ఉపయోగించింది. పోలీసు అధికారులు వాహనమా? అన్న కోణంలో విచారిస్తున్నట్లు తెలిసింది. మునుగోడు ఉప ఎన్నికల్లో డబ్బు చేరవేతకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలిస్తే ఫోన్ ట్యాపింగ్ కేసుకు మరింత బలం చేకూరే అవకాశం ఉంది.

ఫోన్ ట్యాపింగ్ సమాచారంతో అక్రమ వసూళ్లు..

ఫోన్ ట్యాపింగ్ పాల్గొన్న పోలీసులు జిల్లాలో బెదిరింపులు, వసూళ్లకు పాల్పడినట్లు వెలుగులోకి వచ్చింది. విపక్ష నేతల ఫోన్లతోపాటు రైస్ మిల్లర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, గంజాయి వ్యాపారులు, ఇతర పరిశ్రమల యజమానుల ఫోన్లు ట్యాపింగ్ చేసినట్లుగా దర్యాప్తు బృందం గుర్తించింది. ఫోన్ ట్యాపింగ్ ఆధారంగా మిల్లర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, గంజాయి వ్యాపారులను బెదిరించి కానిస్టేబుళ్లు భారీ అక్రమాలకు పాల్పడ్డారట. అక్రమ దందాలు చేసే రైస్‌ మిల్లర్ల నుంచి నెలవారీ మామూళ్లు, పేకాట శిబిరాల నిర్వాహకుల నుంచి వసూళ్లు చేసేవారనే ఆరోపణలున్నాయి. రౌడీ షీటర్‎తో కలసి టాస్క్ ఫోర్స్ పోలీసులు భూ దందాలు, సీటిల్మెంట్లు చేసినట్లు అధికారులు నిర్ధారించారు.

మరిన్ని అరెస్టులు తప్పవా..?

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (సీట్) దర్యాప్తును ముమ్మరం చేసింది. ఫోన్ ట్యాపింగ్ ఆధారంగా ప్రతిపక్షాల డబ్బు పట్టుకోవడం, వ్యాపారులను బ్లాక్ మెయిల్ చేయడం వంటి అంశాలను ప్రభుత్వం సీరియస్‎గా తీసుకుంటే మరిన్ని అరెస్టులు ఉండే అవకాశం ఉంది. అవసరమైతే అప్పుడు పనిచేసిన ఉన్నతాధికారుల అరెస్టులు ఉండే అవకాశాన్ని కొట్టిపారేయలేమని పోలీసు శాఖకు చెందిన ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఫోన్ ట్యాపింగ్‌ వ్యవహారంలో రోజురోజుకు కొత్త కోణాలు వెలుగు చూస్తుండడంతో అటు పోలీసు శాఖలో, ఇటు రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం సృష్టిస్తోంది.

Latest Articles
కాంగ్రెస్ - బీఆర్ఎస్ నేతల చిచ్చు రాజేసిన బూడిద..!
కాంగ్రెస్ - బీఆర్ఎస్ నేతల చిచ్చు రాజేసిన బూడిద..!
బంగ్లాపై థ్రిల్లింగ్ విక్టరీ.. సెమీస్ చేరిన ఆఫ్గాన్..
బంగ్లాపై థ్రిల్లింగ్ విక్టరీ.. సెమీస్ చేరిన ఆఫ్గాన్..
రాజస్థాన్‌లో జలపాతాలు.. వర్షాకాలంలో వీటి అందాలు కనులకు విందు
రాజస్థాన్‌లో జలపాతాలు.. వర్షాకాలంలో వీటి అందాలు కనులకు విందు
ఏంటీ.. ఈ అమ్మాయి జై బోలే తెలంగాణ మూవీ హీరోయినా..? గుర్తుపట్టలేం బ
ఏంటీ.. ఈ అమ్మాయి జై బోలే తెలంగాణ మూవీ హీరోయినా..? గుర్తుపట్టలేం బ
నీళ్లలో ఈదుతూ నదిని దాటుతున్న ఏనుగుల గుంపు.. అద్భుతమైన దృశ్యం
నీళ్లలో ఈదుతూ నదిని దాటుతున్న ఏనుగుల గుంపు.. అద్భుతమైన దృశ్యం
ఫ్యాషన్ షోలో మోడల్ గా డైరెక్టర్ సుకుమార్ కూతురు..
ఫ్యాషన్ షోలో మోడల్ గా డైరెక్టర్ సుకుమార్ కూతురు..
ఒకే ఎడిషన్‌లో అత్యధిక పరుగులు.. రికార్డులు బ్రేక్ చేసిన జోడీ
ఒకే ఎడిషన్‌లో అత్యధిక పరుగులు.. రికార్డులు బ్రేక్ చేసిన జోడీ
లేటు వయసులో పెళ్లి.. లేటెస్ట్ ట్రెండా..? లాభమెంత..? నష్టమెంత?
లేటు వయసులో పెళ్లి.. లేటెస్ట్ ట్రెండా..? లాభమెంత..? నష్టమెంత?
ఇల్లంతా ఆహ్లాదకరమైన సువాసన కోసం నీటిలో వీటిని కలిపి శుభ్రం చేయండి
ఇల్లంతా ఆహ్లాదకరమైన సువాసన కోసం నీటిలో వీటిని కలిపి శుభ్రం చేయండి
100 మీటర్ల సిక్స్.. హ్యాట్రిక్ బౌలర్‌కు చుక్కలు చూపించిన రోహిత్
100 మీటర్ల సిక్స్.. హ్యాట్రిక్ బౌలర్‌కు చుక్కలు చూపించిన రోహిత్