AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: రీల్స్ చేస్తూ బైక్‌పై దూసుకెళ్లిన ముగ్గురు మైనర్లు.. చివరకు.. ఈ వీడియో చూస్తే దెబ్బకు చెమటలు పట్టాల్సిందే..

అతివేగం ప్రాణాలు తీస్తోంది.. వద్దని చెప్పినా కానీ.. ఎవరూ వినడం లేదు.. నిబంధనలను అతిక్రమిస్తూ... వాహనాలను ఓవర్ టెక్ చేయడం.. రాంగ్ రూట్లలో దూసుకెళ్లడం, లైసెన్స్ లేకపోయినా వాహనాలు నడపడం లాంటి ఘటనలతో చాలా మంది ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. తాజాగా.. హైదరాబాద్ నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది..

Hyderabad: రీల్స్ చేస్తూ బైక్‌పై దూసుకెళ్లిన ముగ్గురు మైనర్లు.. చివరకు.. ఈ వీడియో చూస్తే దెబ్బకు చెమటలు పట్టాల్సిందే..
Road Accident
Shaik Madar Saheb
|

Updated on: Jun 16, 2024 | 10:26 AM

Share

అతివేగం ప్రాణాలు తీస్తోంది.. వద్దని చెప్పినా కానీ.. ఎవరూ వినడం లేదు.. నిబంధనలను అతిక్రమిస్తూ… వాహనాలను ఓవర్ టెక్ చేయడం.. రాంగ్ రూట్లలో దూసుకెళ్లడం, లైసెన్స్ లేకపోయినా వాహనాలు నడపడం లాంటి ఘటనలతో చాలా మంది ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. తాజాగా.. హైదరాబాద్ నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.. అతివేగం ఇద్దరి ప్రాణాలు తీయగా.. మరొకరు తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్నాడు.. హైదరాబాద్‌ కూకట్‌పల్లి వై జంక్షన్‌లో అర్థరాత్రి స్కూటీపై ముగ్గురు వేగంగా వెళ్తూ ఆగిఉన్న డీసీఎంను ఢీకొట్టారు.. ఈ ఘటనలో ఇద్దరు మైనర్లు మృతి చెందారు. మరొకరు చికిత్స పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు.

కూకట్‌పల్లి వై జంక్షన్‌లో శనివారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.. మైనర్లు ముగ్గురూ రీల్స్ చేసుకుంటూ స్కూటీపై అతివేగంగా వెళ్తూ.. ఆగిఉన్న డీసీఎంను ఢీకొట్టారని పోలీసులు తెలిపారు. ఇద్దరూ స్పాట్‌లోనే మృతి చెందగా.. వారు సూరారానికి చెందిన ఉదయ్‌, శివదీక్షిత్‌గా పోలీసులు గుర్తించారు.

వీడియో చూడండి..

స్నేహితుడి పుట్టినరోజు సందర్భంగా..

స్నేహితుడి పుట్టినరోజు సందర్భంగా అర్ధరాత్రి బయటకు వచ్చిన ముగ్గురు యువకులు (మైనర్లు).. సెల్‌ఫోన్‌లో రీల్స్‌ చేస్తూ ప్రమాదానికి గురయ్యారని తెలిపారు. ముగ్గురూ చిన్ననాటి స్నేహితులు.. ఇంటర్‌ పూర్తిచేశారు. శనివారం మల్లారెడ్డినగర్‌కు చెందిన ఓ బాలుడి పుట్టినరోజు కావడంతో శుక్రవారం రాత్రి కేకు కోసి సంబరాలు చేసుకున్నారు. ఆ తర్వాత ముగ్గురు కలిసి స్కూటీపై వెళ్తుండగా.. ఈ ఘటన చోటుచేసుకుంది.. గాయపడిన బాలుడి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు పేర్కొంటున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

వరుసగా రెండోసారి కప్పుగెలిచే జట్టుగా భారత్ రికార్డు సృష్టిస్తాందా
వరుసగా రెండోసారి కప్పుగెలిచే జట్టుగా భారత్ రికార్డు సృష్టిస్తాందా
ఒకప్పుడు ఊపేసింది.. ఇప్పుడు ఇలా గుర్తుపట్టలేనంతగా మారిపోయింది..
ఒకప్పుడు ఊపేసింది.. ఇప్పుడు ఇలా గుర్తుపట్టలేనంతగా మారిపోయింది..
ఈ లయ 'శృతి' తప్పింది.. ఇంకాస్త అతి చేసి...
ఈ లయ 'శృతి' తప్పింది.. ఇంకాస్త అతి చేసి...
ఇండియా వర్సెస్ కివీస్.. జనవరి 11 నుంచి టీవీలకు అతుక్కుపోండి
ఇండియా వర్సెస్ కివీస్.. జనవరి 11 నుంచి టీవీలకు అతుక్కుపోండి
రాజకీయాల్లోకి దిగిన హీరోయిన్..
రాజకీయాల్లోకి దిగిన హీరోయిన్..
పోలీసులను చూసి స్పీడ్ పెంచిన అంబులెన్స్ డ్రైవర్.. ఆపి తనిఖీ చేయగా
పోలీసులను చూసి స్పీడ్ పెంచిన అంబులెన్స్ డ్రైవర్.. ఆపి తనిఖీ చేయగా
మీ ఫోన్‌లో వాట్సప్ అకౌంట్ బ్యాన్ అయిందా..? ఇలా చేస్తే చాలు..
మీ ఫోన్‌లో వాట్సప్ అకౌంట్ బ్యాన్ అయిందా..? ఇలా చేస్తే చాలు..
అరటిపండు ఏ టైమ్‌లో తినాలి.. ఎప్పుడు పడితే అప్పుడు తింటే..
అరటిపండు ఏ టైమ్‌లో తినాలి.. ఎప్పుడు పడితే అప్పుడు తింటే..
చూపుడు వేలు ఆకారం.. మీ వ్యక్తిత్వం తెలుపుతుందా.? పండితుల మాటేంటి?
చూపుడు వేలు ఆకారం.. మీ వ్యక్తిత్వం తెలుపుతుందా.? పండితుల మాటేంటి?
అగార్కర్ మార్క్ సెలక్షన్..అక్షర్ పటేల్‎కు ఊహించని ప్రమోషన్
అగార్కర్ మార్క్ సెలక్షన్..అక్షర్ పటేల్‎కు ఊహించని ప్రమోషన్