Hyderabad: హైదరాబాద్‌లో ధార్ గ్యాంగ్ దోపిడీ.! అప్రమత్తంగా ఉండాలని పోలీసుల సూచన

చెడ్డి గ్యాంగ్ తరహాలో దోపిడీలు, దాడులకు పాల్పడే మధ్యప్రదేశ్ కు చెందిన తార్ గ్యాంగ్ సిటీలో ఎంటర్ అయింది. నగర శివారు ప్రాంతాల ప్రజలే టార్గెట్ గా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్నారు ఈ నయా దొంగలు. రాత్రి వేళల్లో ప్రజల అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే పోలీసులు సూచించారు. ఈ గ్యాంగ్ లోని కొందరు హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుల్మోహన్ గ్రేటర్ కమ్యూనిటీలో చోరీ చేసినట్లు డిసిపి ప్రవీణ్ కుమార్ వెల్లడించారు.

Hyderabad: హైదరాబాద్‌లో ధార్ గ్యాంగ్ దోపిడీ.! అప్రమత్తంగా ఉండాలని పోలీసుల సూచన

|

Updated on: Jun 16, 2024 | 2:22 PM

చెడ్డి గ్యాంగ్ తరహాలో దోపిడీలు, దాడులకు పాల్పడే మధ్యప్రదేశ్ కు చెందిన తార్ గ్యాంగ్ సిటీలో ఎంటర్ అయింది. నగర శివారు ప్రాంతాల ప్రజలే టార్గెట్ గా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్నారు ఈ నయా దొంగలు. రాత్రి వేళల్లో ప్రజల అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే పోలీసులు సూచించారు. ఈ గ్యాంగ్ లోని కొందరు హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుల్మోహన్ గ్రేటర్ కమ్యూనిటీలో చోరీ చేసినట్లు డిసిపి ప్రవీణ్ కుమార్ వెల్లడించారు. ప్రహరీపై ఏర్పాటు చేసిన సోలార్ వైర్లను కట్ చేసి ఆ తర్వాత కమ్యూనిటీ లోపలికి చొరబడినట్టు తెలిపారు. నాలుగు ఇళ్లల్లో చోరీకి ప్రయత్నించిన ఈ ముఠా ఓ ఇంట్లో దొరికిన నగదు బంగారం వెండి వస్తువులను తీసుకువెళ్లారని వివరించారు. బాధితుల ఫిర్యాదు కేసు నమోదు చేసినటువంటి పోలీసులు ప్రస్తుతం ముఠా కోసం గాలిస్తున్నారు.

చోరీకి పాల్పడిన ముఠా మధ్యప్రదేశ్ కు చెందిన తార్ అనే భయానక దొంగల ముఠా అని తెలిపారు. సిటీలో సంచరిస్తున్నట్లు గుర్తించారు మరోవైపు హయత్ నగర్ అబ్దుల్లాపూర్మెట్, ఘట్కేసర్ పరిసర ప్రాంత ప్రజలు రాత్రులు ఒంటరిగా తిరగద్దని, గ్రామీణ ప్రాంతాల వారు అలర్ట్ గా ఉండాలని పోలీసులు సూచించారు. ఈ గ్యాంగ్ సభ్యులు శివారులోని హోటల్స్‌లో ఉంటున్నట్లు చెప్పారు. పగలు రెక్కీ నిర్వహించి రాత్రుళ్లు దొంగతనానికి పాల్పడుతున్నట్లు పోలీసులు చెప్పారు. ఒక్కో గ్యాంగులో ఐదుగురు, అంతకంటే ఎక్కువగా ఉన్నట్లు చెప్పారు. అర్ధరాత్రుళ్లు ఎవరైనా తలుపు తడితే తీయవద్దని.. వచ్చిన వారు ఎవరో నిర్ధారంచుకోవాలన్నారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే డయల్ 100కు ఫోన్ చేయాలని సూచించారు. నగర శివారు ప్రాంతాల్లో పెట్రోలింగ్‌ మరింత పెంచినట్లు డిసిపి ప్రవీణ్ కుమార్ వెల్లడించారు. దీంతో అన్ని పోలీస్ స్టేషన్లను అప్రమత్తం చేశారు అధికారులు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us
Latest Articles
అమ్మ బాబోయ్.. ఈ వయ్యారి అందానికి సోషల్ మీడియా షేక్..
అమ్మ బాబోయ్.. ఈ వయ్యారి అందానికి సోషల్ మీడియా షేక్..
రీల్స్ పిచ్చితో డేంజరస్ స్టంట్స్.. స్కూల్‌ విద్యార్థుల పరిస్థితి
రీల్స్ పిచ్చితో డేంజరస్ స్టంట్స్.. స్కూల్‌ విద్యార్థుల పరిస్థితి
12.1 ఓవర్లలో కొట్టాల్సిందే.. ఆసక్తికరంగా సెమీస్ రేస్
12.1 ఓవర్లలో కొట్టాల్సిందే.. ఆసక్తికరంగా సెమీస్ రేస్
త్వరలో కర్కాటకంలో శుక్రుడు ప్రవేశం.. ఈ రాశుల వారికి డబ్బే డబ్బు..
త్వరలో కర్కాటకంలో శుక్రుడు ప్రవేశం.. ఈ రాశుల వారికి డబ్బే డబ్బు..
నేడు లోక్‌సభ స్పీకర్ అభ్యర్థిపై రానున్న స్పష్టత..!
నేడు లోక్‌సభ స్పీకర్ అభ్యర్థిపై రానున్న స్పష్టత..!
మళ్లీ తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు.. తులం ఎంతంటే.?
మళ్లీ తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు.. తులం ఎంతంటే.?
కల్కి సినిమా టికెట్ రేట్లు పెంపునకు AP ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..
కల్కి సినిమా టికెట్ రేట్లు పెంపునకు AP ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..
టాయిలెట్‌ కమోడ్‌లో దూరిన పాము.. వీడియో చూస్తే కళ్లు బైర్లే
టాయిలెట్‌ కమోడ్‌లో దూరిన పాము.. వీడియో చూస్తే కళ్లు బైర్లే
తుఫాన్ హాఫ్ సెంచరీ.. టీ20 ప్రపంచకప్ చరిత్రలో రోహిత్ భారీ రికార్డ్
తుఫాన్ హాఫ్ సెంచరీ.. టీ20 ప్రపంచకప్ చరిత్రలో రోహిత్ భారీ రికార్డ్
ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీకి ఎందుకు కోపమొచ్చింది?
ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీకి ఎందుకు కోపమొచ్చింది?