PPE Kits: పీపీఈ కిట్లు ధరించి అంత్యక్రియలు.. ఎందుకంటే.? వీడియో..

PPE Kits: పీపీఈ కిట్లు ధరించి అంత్యక్రియలు.. ఎందుకంటే.? వీడియో..

Anil kumar poka

|

Updated on: Jun 16, 2024 | 3:33 PM

ఒక కుటుంబం పీపీఈ కిట్లు ధరించి చనిపోయిన వ్యక్తి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించింది. అయితే ఆ వ్యక్తి ఏ కరోనా వల్లనో మరణించలేదు. తేనెటీగలు దాడి నుంచి తప్పించుకునేందుకు ఆ కుటుంబ సభ్యులు పీపీఈ కిట్లు ధరించి అంత్యక్రియలు జరిపారు. విస్తుపోయేలా ఉన్న ఈ ఘటన మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లాలో జరిగింది. తితవలి గ్రామానికి చెందిన 70 ఏళ్ల రైతు గుండెపోటుతో మరణించాడు.

ఒక కుటుంబం పీపీఈ కిట్లు ధరించి చనిపోయిన వ్యక్తి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించింది. అయితే ఆ వ్యక్తి ఏ కరోనా వల్లనో మరణించలేదు. తేనెటీగలు దాడి నుంచి తప్పించుకునేందుకు ఆ కుటుంబ సభ్యులు పీపీఈ కిట్లు ధరించి అంత్యక్రియలు జరిపారు. విస్తుపోయేలా ఉన్న ఈ ఘటన మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లాలో జరిగింది. తితవలి గ్రామానికి చెందిన 70 ఏళ్ల రైతు గుండెపోటుతో మరణించాడు. ఈ నేపథ్యంలో గురువారం కుటుంబ సభ్యులు, బంధువులు స్థానిక శ్మశాన వాటికలో అంత్యక్రియలకు సిద్ధమయ్యారు. అయితే పొగ వల్ల అక్కడి చెట్టుకు ఉన్న తేనెటీగలు విజృంభించాయి. మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులపై అవి దాడి చేశాయి.

దీంతో వారంతా అక్కడి నుంచి పరుగులు తీశారు. ఈ నేపథ్యంలో అంత్యక్రియలకు ఆటంకం కలిగింది. మరోవైపు సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి కొందరు వ్యక్తులు వెళ్లారు. అక్కడి నుంచి ఐదు పీపీఈ కిట్లు తెచ్చారు. మృతుడి కుమారుడు, ముఖ్యమైన బంధువులు వాటిని ధరించారు. సుమారు రెండు గంటల తర్వాత అంత్యక్రియలను పూర్తి చేశారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.