Hyderabad: వాహనదారులూ బహుపరాక్.. హైదరాబాద్‌లో మరో పెట్రోల్ మోసం.. ఏకంగా అరలీటర్ చీటింగ్..

అసలే ఇంధన ధరలు భారీగా పెరిగాయని, ఆర్థికంగా చితికిపోతున్నామని జనాలు గగ్గోలు పెడుతుంటే.. మరోవైపు పెట్రోల్ బంకుల మోసాలతో మరింత నష్టపోతున్నారు.

Hyderabad: వాహనదారులూ బహుపరాక్.. హైదరాబాద్‌లో మరో పెట్రోల్ మోసం.. ఏకంగా అరలీటర్ చీటింగ్..
Fuel Fruad

Updated on: Nov 17, 2022 | 12:44 PM

అసలే ఇంధన ధరలు భారీగా పెరిగాయని, ఆర్థికంగా చితికిపోతున్నామని జనాలు గగ్గోలు పెడుతుంటే.. మరోవైపు పెట్రోల్ బంకుల మోసాలతో మరింత నష్టపోతున్నారు. పెట్రోల్ బంకుల మోసాలను కట్టడి చేసేందుకు అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. ఆ మోసాలు ఆగడం లేదు. రోజుకో కొత్త తరహాలో పెట్రోల్ మోసాలు వెలుగు చూస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లో పెట్రోల్ బంకుల్లో మోసాల నియంత్రణకు అధికారులు పకడ్బందీ చర్యలు చేపడుతున్నా.. మోసాలు మాత్రం ఆగడం లేదు. తాజాగా హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని ఓ పెట్రోల్ బంక్‌లో చిప్ అమర్చి మోసం చేస్తున్న వైనం బయటపడింది. ఆ మోసం తెలిసి ఫైర్ అయ్యారు వాహనదారులు.

రాజేంద్రనగర్ సర్కిల్‌లోని 313 ఫిల్లర్ దగ్గర ఉన్న ఇండియన్ పెట్రోల్ బంకులో చిప్ అమర్చి పెట్రోల్‌ను తక్కువ పోస్తున్నట్లు గుర్తించారు పలువురు వాహనదారులు. బంకు ముందు ఆందోళనకు దిగారు. ప్రతి ఐదు లీటర్లకు అరలీటరు చొప్పున తక్కువగా రావడంతో వెంటనే అధికారులకు ఫిర్యాదు చేశారు.

విషయం తెలుసుకున్న తూనికల శాఖ అధికారులు, ఎస్‌వోటీ పోలీసులు, సివిల్ సప్లయి అధికారులు ఏకకాలంలో బంకుపై దాడులు చేశారు. పెట్రోల్ మోసం నిజమేనని నిర్ధారించారు. పెట్రోల్‌ పోసేందుకు అమర్చిన చిప్‌ను స్వాధీనం చేసుకున్నారు. వాహనదారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు అధికారులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..