Hyderabad: పెట్రోల్ బంక్ వద్ద దుండగుడు తుపాకీతో హల్చల్.. బంక్ సిబ్బందిపై దాడి.. ఫర్నిచర్ ధ్వంసం
పెట్రోల్ బంక్ అద్దాల ధ్వంసంలో భాగంగా ఇఫ్తికార్ అహ్మద్ చేయికి తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే పెట్రోల్ బంక్ యజమాని పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో నిందితుని సహచరులు ఇద్దరు పారిపోయారు.
![Hyderabad: పెట్రోల్ బంక్ వద్ద దుండగుడు తుపాకీతో హల్చల్.. బంక్ సిబ్బందిపై దాడి.. ఫర్నిచర్ ధ్వంసం](https://images.tv9telugu.com/wp-content/uploads/2022/10/hyderabad-petrol-bunk-1.jpg?w=1280)
హైదరాబాద్ పాతబస్తీ బహదూర్ పుర చౌరస్తాలోని పెట్రోల్ బంక్ పై దుండగులు దాడి చేశారు. డబ్బులు అడిగినందుకు యజమానిపై దాడి చేసి.. ఫర్నిచర్ ధ్వసం చేశారు. పెట్రోల్ కోసం ఇఫ్తికార్ అహ్మద్ తన ద్విచక్ర వాహనంతో పెట్రోల్ బంక్ దగ్గరకు చేరుకున్నాడు. అతను 500 రూపాయల పెట్రోల్ పోయించుకున్నాడు. అనంతరం పెట్రోల్ బంక్ సిబ్బంది పెట్రోల్ కు సంబంధించిన నగదును అడగగా.. ఆన్ లైన్ చేస్తానని తెలిపాడు. దీంతో పెట్రోల్ బంక్.. యజమాని మెహత జోక్యం చేసుకొని ఇఫ్తికార్ అహ్మద్ ని డబ్బులు అడిగాడు. అప్పుడు తర్వాత వచ్చి ఇస్తానని తెలిపాడు. దీంతో ఇరువురి మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. అప్పుడు నిందితుడు వారి సహచరులకు ఫోన్ చేశాడు. వారు రావడంతోనే.. విచక్షణారహితంగా పెట్రోల్ బంకు సిబ్బందిపై దాడి చేసి ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు.
పెట్రోల్ బంక్ అద్దాల ధ్వంసంలో భాగంగా ఇఫ్తికార్ అహ్మద్ చేయికి తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే పెట్రోల్ బంక్ యజమాని పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో నిందితుని సహచరులు ఇద్దరు పారిపోయారు. పోలీసులు గాయాల పాలైన ఇఫ్తికార్ అహ్మద్ ను అదుపులోకి తీసుకొని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. దాడిలో భాగంగా నిందితులు తుపాకీతో హల్చల్ చేసినట్లు సీసీ కెమెరాలు దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. ఈ తుపాకీ అసలైనదా డమ్మీనా అనేదా తేలాల్సి ఉంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని బహదూర్ పుర సీఐ సుధాకర్ తెలిపారు.
రిపోర్టర్: నూర్, TV9, Telugu
![Image](https://images.tv9telugu.com/wp-content/uploads/2022/10/minister-satyavathi-rathod.jpg)
![Image](https://images.tv9telugu.com/wp-content/uploads/2022/10/ktr-on-hyderabad-4.jpg)
![Image](https://images.tv9telugu.com/wp-content/uploads/2022/10/blood-donation.jpg)
![Image](https://images.tv9telugu.com/wp-content/uploads/2022/09/hyderabad-it-crisis.jpg)
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..