Warangal: హనుమకొండలో దారుణం.. దహన సంస్కారాలకు దారి ఇవ్వకపోవడంతో ఇంట్లోనే మృతదేహం..!

|

Dec 20, 2021 | 9:14 AM

Warangal: వారు మహారాజులు.. అది మనం అన్నది కాదు. వారే మేము మహారాజులమని మహారాజుల కాలనీ అనీ బోర్డ్ పెట్టుకున్నారు. కానీ, వారి ఇళ్లలో ఉండే వ్యక్తి చనిపోతే కనీసం..

Warangal: హనుమకొండలో దారుణం.. దహన సంస్కారాలకు దారి ఇవ్వకపోవడంతో ఇంట్లోనే మృతదేహం..!
Follow us on

Warangal: వారు మహారాజులు.. అది మనం అన్నది కాదు. వారే మేము మహారాజులమని మహారాజుల కాలనీ అనీ బోర్డ్ పెట్టుకున్నారు. కానీ, వారి ఇళ్లలో ఉండే వ్యక్తి చనిపోతే కనీసం దారి ఇవ్వలేని చక్రవర్తులుగా మారిపోయారు. దహన సంస్కారాలకు దారి ఇవ్వకపోవడంతో రెండు రోజులుగా ఓ కుటుంబం మృతదేహంతో ఇంట్లోనే దయనీయంగా ఎదురుచూస్తోంది. ఈ అమానవీయ ఘటన హనుమకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రంలో చోటు చేసుకుంది.

ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకెళితే.. హనుమకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రానికి చెందిన బరిగెల సురేష్(28) అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందాడు. సురేష్ మృతదేహాన్ని ఆసుపత్రి నుంచి ఇంటికి తీసుకెళ్లిన బందువులకు చుట్టు పక్కల వారి నుంచి చుక్కెదురైంది. ఇంటి ముందు వారు గతంలోనే గోడ నిర్మాణం చేపట్టగా.. తాజాగా పక్కింటి వారు ముళ్ళ కంపలు అడ్డు వేసి దారి ఇవ్వం అంటూ భీష్మించుకొని కూర్చున్నారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిన్నటి నుంచి మృతదేహం నుంచి దుర్వాసన వస్తుండటంతో చేసేదేం లేక.. తమ ఇంటి ప్రాంగణంలోనే మృతదేహాన్ని పాతి పెట్టేందుకు యత్నించారు. దీంతో స్థానికులు వారిని అడ్డుకొని వారించారు. ఇంత జరుగుతున్నా గ్రామ ప్రజాప్రతినిధులు గానీ, అధికారులు గానీ ఇప్పటి వరకు స్పంచించకపోవడం విమర్శలకు దారి తీస్తోంది. ఎలాగైనా దారి చూపించి సురేష్ అంత్యక్రియలు జరిగేలా చూడాలని, లేదంటే ఇంటి ప్రాంగణంలోనే శవాన్ని పూడ్చి వేసుకుంటామని బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Also read:

Good Governance Week: నేడు దేశవ్యాప్తంగా సుపరిపాలన వారోత్సవాల కార్యక్రమాన్ని ప్రారంభించనున్న కేంద్రం..

Income Tax Password: ఆదాయపు పన్ను పోర్టల్‌లో పాస్‌వర్డ్‌ మర్చిపోయారా..? ఇలా చేయండి

Bigg Boss 5 Telugu Winner: సిరి, షణ్ముఖ్ రిలేషన్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసిన సన్నీ.. ఏమన్నాడంటే..