Revanth Reddy: కర్ణాటక ఫలితాలు ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్‌లను ఓడించినట్లే.. రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

కర్ణాటకలో రసవత్తరంగా మారిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 135 అసెంబ్లీ స్థానాల్లో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఎన్నికల ఫలితాలపై తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం దేశం మొత్తం కర్ణాటక ఎన్నికల గురించే చర్చించుకుంటోందని తెలిపారు.

Revanth Reddy: కర్ణాటక ఫలితాలు ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్‌లను ఓడించినట్లే.. రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Revanth Reddy

Updated on: May 18, 2023 | 5:19 PM

కర్ణాటకలో రసవత్తరంగా మారిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 135 అసెంబ్లీ స్థానాల్లో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఎన్నికల ఫలితాలపై తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం దేశం మొత్తం కర్ణాటక ఎన్నికల గురించే చర్చించుకుంటోందని తెలిపారు. ప్రధాని మోదీ బ్రాండ్‌కు కాలం చెల్లిందని.. ఆయన నియంతృత్వానికి వ్యతిరేకంగా కర్ణాటక ప్రజలు పోరాటం చేశారని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఒకవైపు ఈశాన్య రాష్ట్రం మణిపూర్ తగలబడిపోతుంటే.. ప్రదాని మోదీ మాత్రం కర్ణాటకలో మాకాం వేశారని విమర్శించారు. బజరంగ్‌దళ్, హిజాబ్‌లతో అక్కడ గెలవాలని మోదీ ప్రయత్నాలు చేసినప్పటికీ అవి ఫలించలేవని ఆరోపించారు.

అయితే కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపును అందరూ ప్రశంసిస్తుంటే.. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మాత్రం మింగుడు పడటం లేదని విమర్శించారు. ప్రదాని మోదీని ఓడిస్తానని పెద్ద పెద్ద ఉపన్యాసాలు చేసిన కేసీఆర్ మాటలు నిజమేనని తాము అనుకున్నామన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపును ఆయన అభినందిస్తారని ఆశించామని పేర్కొన్నారు.
కానీ సీఎం కేసీఆర్, రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్‌ లు అసలు కర్ణాటక గెలుపును పట్టించుకోవాల్సిన అవసరం లేదంటున్నారని ఆరోపించారు. బీజేపీ బాటలోనే కేసీఆర్ నడుస్తున్నారని మండిపడ్డారు. కర్ణాటకలో ఫలితాలు ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్‌లను ఓడించినట్లేనని పేర్కొన్నారు. అక్కడ బీసీ పాలసీని ఎలా తీసుకొచ్చామో ఇక్కడ కూడా తీసుకొస్తామన్నారు. అలాగే త్వరలోనే బీసీ గర్జన పెడుతామని వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..