Telangana: ‘దిష్టి’చుక్క .. దీనికుందో లెక్క..! నిత్యం రగులుతూనే ఉన్న తెలంగాణ సెంటిమెంట్..

ఇంతకీ.. ఏం జరిగింది అక్కడ? తెలంగాణ టాపిక్ ఎందుకొచ్చింది? కోనసీమ అంటేనే కొబ్బరిచెట్లకు నెలవు. ఆ అందం అద్భుతం. కాని, క్రమంగా ఆ ఛాయలు తగ్గిపోతున్నాయి. లక్షలాది కొబ్బరి చెట్లు చనిపోతున్నాయి. కొబ్బరి చెట్టు పైభాగం రాలిపోయి ఎండిపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీనికి కారణం.. సముద్రపు ఆటుపోటులే..

Telangana: ‘దిష్టి’చుక్క .. దీనికుందో లెక్క..! నిత్యం రగులుతూనే ఉన్న తెలంగాణ సెంటిమెంట్..
Pawan Kalyan Konaseema Remark

Updated on: Dec 02, 2025 | 9:56 PM

తెలంగాణ సెంటిమెంట్ ఎవర్‌గ్రీన్. జనరల్‌గా రాజకీయాల్లో ఆయుధాలు ఒకసారే పనిచేస్తాయ్. మళ్లీ మళ్లీ అదే అస్త్రం ప్రయోగిస్తామంటే నడవదు. బట్.. తెలంగాణ సెంటిమెంట్ అలా కాదు. నివురుగప్పిన నిప్పులా ఎప్పటికీ అలా ఉంటుందంతే. జస్ట్.. ఊదితే చాలు జ్వాల రగులుతుంది. రాష్ట్ర విభజన జరిగి 12 ఏళ్లైనా సరే.. ఇప్పటికీ సెంటిమెంట్ సజీవంగానే ఉంది. ఆ పల్స్ పొలిటికల్ లీడర్స్‌కు తెలియంది కాదు. అందుకే, తమ రాజకీయానికి వాడుకుంటుంటారు. ఇంతకీ.. పవన్ కల్యాణ్ ఎందుకు అలాంటి కామెంట్స్ చేయాల్సి వచ్చింది? జనసేన నేతలకు, అధికార ప్రతినిధులకు చాలా స్పష్టమైన ఆదేశాలొచ్చాయ్. పవన్ కల్యాణ్ మాట్లాడిన మాటలకు ఎవరెలాంటి కౌంటర్ ఇస్తున్నా సరే.. జనసేన తరపున మాత్రం ఒక్క స్టేట్‌మెంట్ కూడా బయటకు రావడానికి వీల్లేదని ఆఫ్ ది రికార్డ్ ఇన్‌స్ట్రక్షన్స్ వచ్చాయ్. అందుకే, పవన్ కల్యాణ్ మాట్లాడిన తరువాత.. జనసేన నుంచి ఇంకెవరూ ఆ టాపిక్ తీయలేదు. ఎంతైనా.. ‘తెలంగాణ’ సెంటిమెంట్‌కు సంబంధించిన విషయం కదా.. జనసేన పార్టీ ఆ స్టాండ్ తీసుకున్నట్టుంది. అందుకే, ఏపీలో వైసీపీ నేతలు అటాక్ చేస్తున్నా సరే… ఎలాంటి కౌంటర్ ఇవ్వకుండా నిశ్శబ్దాన్ని పాటిస్తోంది గాజు గ్లాసు పార్టీ.. ఇంతకీ.. ఏం జరిగింది అక్కడ? తెలంగాణ టాపిక్ ఎందుకొచ్చింది? కోనసీమ అంటేనే కొబ్బరిచెట్లకు నెలవు. ఆ అందం అద్భుతం. కాని, క్రమంగా ఆ ఛాయలు తగ్గిపోతున్నాయి. లక్షలాది కొబ్బరి చెట్లు చనిపోతున్నాయి. కొబ్బరి చెట్టు పైభాగం రాలిపోయి ఎండిపోతున్న పరిస్థితులు...

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి